News April 4, 2025
Dy.CM పవన్కు భూమన సవాల్

తిరుమల లడ్డూ నాణ్యత తమ ప్రభుత్వంలోనే పెరిగిందని వైసీపీ నేత భూమన అన్నారు. ఈ అంశంపై కూటమి నేతలు తమపై కావాలనే తప్పుడు ప్ర చారాలు చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో వీఐపీ దర్శనాల సంఖ్య రెట్టింపు అయ్యిందని ఆరోపించారు. మంత్రి లోకేశ్ పీఏ నుంచి అధికంగా లెటర్లు వస్తున్నాయన్నారు. వైసీసీ హయాంలో తప్పు జరిగిందో లేక కూటమి ప్రభుత్వంలో తప్పులు జరిగాయో చర్చకు తాము సిద్ధం అంటూ Dy.CM పవన్కు ఆయన సవాల్ విసిరారు.
Similar News
News April 5, 2025
SR పురం : తండ్రిని హత్య చేసిన కుమారుడు అరెస్ట్

SRపురం మండలం పాపిరెడ్డిపల్లెలో శ్రీనివాసులు (60)ను కొడుకు నాగరాజు బుధవారం హత్య చేసిన విషయం తెలిసిందే. నిందితుడిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. తండ్రి తరచూ మద్యం తాగి వచ్చి తల్లిని కొట్టేవాడు. అది సహించలేక నాగరాజు తండ్రి తలపై ఇటుకతో కొట్టాడు. తీవ్రంగా గాయపడి శ్రీనివాసులు మృతిచెందగా..మృతుని అన్న ఫిర్యాదుతో కార్వేటినగరం సీఐ హనుమంతప్ప, ఎస్సై సుమన్ నాగరాజుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
News April 5, 2025
హుబ్లీ రైల్వే డివిజన్ సభ్యునిగా ఎమ్మెల్సీ భరత్

హుబ్లీ రైల్వే డివిజన్ వినియోగదారుల సలహా కమిటీ సభ్యుడిగా చిత్తూరు ఎమ్మెల్సీ భరత్ నియమితులయ్యారు. రాష్ట్ర శాసనసభ జనరల్ సెక్రటరీ సిఫార్సు మేరకు ఈ నియామకం చేసినట్లు నైరుతి రైల్వే డివిజనల్ మేనేజర్ అరవింద హెర్లె శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.
News April 5, 2025
ప్రమాదకరంగా చిత్తూరు-పుత్తూరు రోడ్డు

చిత్తూరు-పుత్తూరు జాతీయ రహదారి ప్రమాదకరంగా ఉంది. ఎక్కడబడితే అక్కడ గుంతలు తీసి మట్టిని రోడ్డుపై వేయడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. రాత్రివేళల్లో ఈ మార్గంలో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.