News April 4, 2025

Dy.CM పవన్‌కు భూమన సవాల్

image

తిరుమల లడ్డూ నాణ్యత తమ ప్రభుత్వంలోనే పెరిగిందని వైసీపీ నేత భూమన అన్నారు. ఈ అంశంపై కూటమి నేతలు తమపై కావాలనే తప్పుడు ప్ర చారాలు చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో వీఐపీ దర్శనాల సంఖ్య రెట్టింపు అయ్యిందని ఆరోపించారు. మంత్రి లోకేశ్ పీఏ నుంచి అధికంగా లెటర్లు వస్తున్నాయన్నారు. వైసీసీ హయాంలో తప్పు జరిగిందో లేక కూటమి ప్రభుత్వంలో తప్పులు జరిగాయో చర్చకు తాము సిద్ధం అంటూ Dy.CM పవన్‌కు ఆయన సవాల్ విసిరారు.

Similar News

News April 18, 2025

చిత్తూరు జిల్లా టీచర్లకు గమనిక 

image

జిల్లాలోని అన్ని యాజమాన్యాల ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్‌లకు హెచ్ఎంలుగా ప్రమోషన్ ఇవ్వనున్నారు. సంబంధిత మెరిట్ సీనియార్టీ జాబితాను విడుదల చేసినట్లు  డీఈవో వరలక్ష్మి తెలిపారు. అభ్యంతరాలు ఉంటే 20వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు తన కార్యాలయంలో తెలియజేయాలని కోరారు. సెలవు దినాల్లోనూ అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు.  

News April 17, 2025

రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి: కలెక్టర్ 

image

జిల్లాలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో రెవెన్యూ అధికారులతో జేసీ విధ్యాదరితో సమీక్షించారు. భూ సమస్యల పరిష్కారానికి MROలు తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మ్యూట్యుయేషన్లు, ప్రభుత్వ భూముల పరిరక్షణ, జీవో నంబర్.30 ప్రకారం ప్రభుత్వ భూముల రెగ్యులరైజేషన్ అంశాలను పరిశీలించాలన్నారు.

News April 17, 2025

చిత్తూరు: ఈనెల 20 వరకు రేషన్ పంపిణీ

image

చిత్తూరు జిల్లాలో రేషన్ పంపిణీని ఈనెల 20వ తేదీ వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు డీఎస్వో శంకరన్ తెలిపారు. ఇప్పటి వరకు 87 శాతం రేషన్ పంపిణీ చేసినట్లు వెల్లడించారు. అధిక శాతం మంది కార్డుదారులు రేషన్ తీసుకోవాలనే ఉద్దేశంతో పంపిణీని ఈనెల 20వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించినట్లు చెప్పారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

error: Content is protected !!