News April 4, 2025
Dy.CM పవన్‌తో వినుత కోట భేటీ

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను మంగళగిరిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో గురువారం శ్రీ కాళహస్తి జనసేన ఇన్‌ఛార్జ్ వినుత కోట మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని రాజకీయ అంశాల, పార్టీ స్థితి గతులను ఆమె పవన్ కళ్యాణ్‌కు వివరించారు. అనంతరం ఆమె పవన్‌తో కలిసి తిరుపతి-పళని నూతన బస్సు సర్వీసు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
Similar News
News January 7, 2026
అల్లూరి: స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ శతశాతం పూర్తి చేయాలి

అల్లూరి, పోలవరం జిల్లాల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ శతశాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ మంగళవారం అధికారులను ఆదేశించారు. రేషన్ సరుకుల పంపిణీలో వచ్చే అవాంతరాలను అధిగమించాలన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు నమోదు, తొలగింపు కార్యక్రమాలను సమగ్ర సమాచారంతో చేపట్టాలని సూచించారు. పెండింగ్లో ఉన్న రేషన్ కార్డు లబ్దిదారుల ఈ-కేవైసీ సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.
News January 7, 2026
విశాఖ: భర్త మిస్సింగ్.. భార్యే చంపేసిందా?

బక్కన్నపాలెం కే2 కాలనీలో అల్లాడ నాగరాజు అదృశ్యం కేసు మిస్టరీ కలకలం రేపుతోంది. గత నవంబర్‌లో భర్త నాగరాజు మిస్ అవగా DEC 9న భార్య రమ్య పీఎంపాలెం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఇంట్లో నగలు తీసుకుని పరారయ్యాడని ఫిర్యాదులో ఆమె పేర్కొంది. అయితే విచారణలో రమ్యపై పోలీసులకు అనుమానం వచ్చింది. ఆమెతో పాటు మరో ముగ్గురిని నిన్న అదుపులోకి తీసుకున్నారు. హత్యాకోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 7, 2026
GNT: హెల్మెట్ లేకపోతే వాట్సాప్ హెచ్చరికలు

ద్విచక్ర వాహనదారుల్లో హెల్మెట్ వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. గుంటూరు నగరంలోని ప్రధాన కూడళ్లలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా హెల్మెట్ లేకుండా వాహనం నడిపిన వారిని గుర్తించి, వారి ఫోన్‌లకు వాట్సాప్ హెచ్చరికలు పంపిస్తోంది. రహదారి భద్రత సూచనగా పంపిన ఈ సందేశాల్లో నో హెల్మెట్ ఉల్లంఘనను చివరి హెచ్చరికగా పేర్కొంటూ, మళ్లీ కొనసాగితే జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది.


