News February 22, 2025

Dy.cm పవన్ కుంభమేళా ఫొటోలతో పోస్ట్‌లు.. కేసు నమోదు

image

Dy.cm పవన్ కళ్యాణ్‌, ఆయన కుంటుంబ సభ్యులు ఇటీవల ప్రయాగరాజ్‌లోని మహాకుంభ మేళాలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్, ఆయన కుంటుంబీకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. పవన్ కళ్యాణ్ కుంభమేళా ఫొటోలను గుర్తుతెలియని వ్యక్తుల పేర్లతో ఉన్న నాలుగు Xఎకౌంట్‌లలో పోస్ట్ చేసి తీవ్రమైన పదజాలంతో వ్యాఖ్యలు చేశారని జనసేన నాయకులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Similar News

News December 5, 2025

ASF: జిల్లాలో మొదటి రాండమైజేషన్ పూర్తి

image

2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్, అదనపు పోలింగ్ అధికారుల మొదటి రాండమైజేషన్ పూర్తి చేసినట్లు అదనపు కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. శుక్రవారం ASF జిల్లా కలెక్టరేట్ సముదాయంలో గల వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో సాధారణ ఎన్నికల పరిశీలకులు శ్రీనివాస్ సమక్షంలో పోలింగ్, అదనపు పోలింగ్ అధికారుల మొదటి రాండమైజేషన్ నిర్వహించారు.

News December 5, 2025

దుష్ప్రచారాలు వ్యాప్తి చేయవద్దు : కలెక్టర్

image

పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు ఆదేశాలు వచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న దుష్ప్రచారాలను నమ్మవద్దని కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టంచేశారు. పెద్దంపేట సర్పంచ్ నామినేషన్ అంశంపై హైకోర్టు నుంచి ఎటువంటి ఆదేశాలు అందలేదని తెలిపారు. ఎన్నికల పర్యవేక్షణలో భాగంగా పర్యటించానని, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఏ కోర్టు విచారణకు హాజరుకాలేదని పేర్కొన్నారు. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటమన్నారు.

News December 5, 2025

రాష్ట్రపతి భవన్‌కు పుతిన్.. ఘన స్వాగతం

image

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. ఆయనకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఘన స్వాగతం పలికారు. పుతిన్ గౌరవార్థం అక్కడ విందు ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, రాయబారులు పాల్గొంటున్నారు. అయితే ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ ఖర్గేకు ఆహ్వానం అందలేదు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ను ఆహ్వానించడం గమనార్హం.