News March 23, 2025
Dy.CM పవన్ కళ్యాణ్‌ని సన్మానించిన బుడగ జంగాలు

కర్నూలు జిల్లా పూడిచెర్లకి వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కి బేడ బుడగ జంగం రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ సన్మానించారు. క్యాబినెట్, అసెంబ్లీలో బుడగ జంగలకు ఎస్సీ హోదా కల్పించేందుకు ఆమోదం తెలిపిన కూటమి నాయకులకు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, MP బైరెడ్డి శబరికు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News March 23, 2025
యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం నూతన కార్యవర్గం ఎన్నిక

యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం కర్నూలు జిల్లా నూతన కార్యవర్గం ఆదివారం జిల్లా పరిషత్ కార్యాలయంలోని ఎంపీపీ భవన్ నందు ఏకగ్రీవంగా ఎన్నికైంది. జిల్లా అధ్యక్షునిగా విద్యాసాగర్, సెక్రెటరీగా చంద్రమోహన్, కోశాధికారిగా సంధ్యా ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యలపై రాజు లేని పోరాటాలు చేస్తామన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామన్నారు.
News March 23, 2025
డబుల్ సెంచరీతో చెలరేగిన రుత్విక్ కళ్యాణ్

కర్నూలులో జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన పోటీల్లో కర్నూలుకు చెందిన రుత్విక్ కళ్యాణ్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. నంద్యాలతో జరిగిన మ్యాచ్‌లో 219 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు ఆదోనితో జరిగిన మ్యాచ్‌లో 122 బంతుల్లో 154 పరుగులు చేసి తన సత్తా చాటాడు. క్రికెట్‌లో అంతర్జాతీయ స్థాయికి రుత్విక్ కళ్యాణ్ చేరుకోవాలని పలువురు ఆకాంక్షించారు.
News March 23, 2025
నంద్యాలలో వార్డెన్‌పై పోక్సో కేసు

నంద్యాలలోని ఓ స్కూల్ హాస్టల్ వార్డెన్ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రేమ పేరిట మాయమాటలతో మభ్యపెట్టి.. బాలికను తిరుపతికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక అమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.