News September 5, 2024
Dy.CM పవన్ కళ్యాణ్కు వైరల్ ఫీవర్

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్, తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారు. కొన్ని రోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతూనే విజయవాడ వరదలపై సమీక్షలు నిర్వహించారు. ఇవాళ కూడా అస్వస్థతతోనే అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. ప్రస్తుతం ఆయనకు ఫీవర్ ఇంకా ఎక్కువ కావడంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
Similar News
News January 20, 2026
నా సినిమా 23 ఆత్మహత్యలను ఆపింది: అంకిత్ సఖియా

తాను తెరకెక్కించిన ‘లాలో-కృష్ణ సదా సహాయతే’ సినిమాకు ఎంతో మంది కనెక్ట్ అయ్యారని డైరెక్టర్ అంకిత్ సఖియా చెప్పారు. ఆత్మహత్య చేసుకుందామని అనుకున్న 23 మంది ఈ సినిమా చూశాక తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని వెల్లడించారు. ఈ క్రమంలో ఈ చిత్రాన్ని దేశం మొత్తం చూపించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కాగా రూ.50 లక్షలతో తెరకెక్కిన ఈ గుజరాతీ మూవీ రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది.
News January 20, 2026
LRS.. ఇలా అప్లై చేసుకోండి

AP: 2025 జూన్ 30లోపు రిజిస్టర్ అయిన <<18903924>>ప్లాట్లు<<>> లేదా లే అవుట్లు మాత్రమే క్రమబద్ధీకరణ చేసుకోవచ్చు. గ్రామ/వార్డు సచివాలయం లేదా ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. lrsdtcp.ap.gov.inలోకి వెళ్లి సేల్ డీడ్, లింక్ డాక్యుమెంట్లు, ప్లాట్ ప్లాన్, ఫొటోలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫీజులో రూ.10వేలకు తగ్గకుండా ప్రాథమికంగా చెల్లించాలి. ఆ తర్వాత రాయితీ ఇస్తారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అభ్యంతరాలు స్వీకరిస్తారు.
News January 20, 2026
కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్లో 210 పోస్టులు.. అప్లై చేశారా?

<


