News January 11, 2025
నేడు కర్నూలు జిల్లాలో Dy.CM పవన్ పర్యటన
AP: Dy.CM పవన్ నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. పిన్నాపురం గ్రీన్ కో ప్రాజెక్టును ఆయన పరిశీలించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 11.30 గంటలకు ప్రత్యేక విమానంలో కర్నూలు చేరుకుంటారు. అనంతరం హెలికాప్టర్లో ప్రాజెక్టులోని సౌర విద్యుత్, హైడల్ పవర్ ప్లాంట్లను ఏరియల్ వ్యూ చేయనున్నారు. అనంతరం రోడ్డు మార్గాన ప్రాజెక్టును సందర్శిస్తారు. సాయంత్రం 4.50గం.కు కర్నూలు నుంచి ఆయన తిరుగుపయనం అవుతారు.
Similar News
News January 11, 2025
2025లో ఈ ఉద్యోగుల శాలరీ ఇంక్రిమెంట్ తగ్గొచ్చు!
MNC ఉద్యోగులకు షాక్! 2025లో మీ శాలరీ ఇంక్రిమెంట్ తగ్గొచ్చు. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి కొనసాగుతుండటమే ఇందుకు కారణం. మిగతా కంపెనీలతో పోలిస్తే GCCలు ఇంక్రిమెంట్లు ఎక్కువే పెంచుతున్నా గతేడాది కన్నా తక్కువ పర్సంటేజే ఉంటుందని డెలాయిట్ ఇండియా డేటా చెబుతోంది. IT ప్రొడక్ట్ కంపెనీలు గతేడాది 10% పెంచగా ఈసారి 9కే పరిమితం కావొచ్చని తెలిసింది. IT సర్వీస్ సెక్టార్లో కోత ఇంకా ఎక్కువే ఉండనుంది.
News January 11, 2025
రాష్ట్రాన్ని పునర్ నిర్మించుకుందాం రండి: ITDP
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రజలతో హైదరాబాద్లోని బస్టాండ్లు, ప్రధాన కూడళ్లలో రద్దీ కనిపించింది. ఈ నేపథ్యంలో ITDP ఆసక్తికర ట్వీట్ చేసింది. ‘అమరావతిని నిర్మించుకుందాం, విశాఖను ITహబ్గా తీర్చిదిద్దుకుందాం. రాయలసీమకు పరిశ్రమలు తెచ్చుకుందాం. ఆంధ్రులకు పొరుగు దేశానికి, రాష్ట్రానికి వెళ్లే అవసరం లేకుండా రాష్ట్రాన్ని పునర్ నిర్మించుకుందాం కలిసిరండి. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి!’ అని పేర్కొంది.
News January 11, 2025
నేడు బీజీటీపై బీసీసీఐ సమీక్ష
బోర్డర్ గవాస్కర్ సిరీస్లో భారత్ ఘోర ప్రదర్శనపై బీసీసీఐ ఈరోజు సమీక్షించనుంది. బోర్డు పెద్దలు పాల్గొనే ఈ సమావేశంలో రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ తమ వివరణను ఇవ్వనున్నారు. భవిష్య టెస్టు జట్టు కూర్పుపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ సిరీస్ను భారత్ 1-3 తేడాతో కోల్పోయింది. పదేళ్లలో ఈ సిరీస్ ఓటమి ఇదే తొలిసారి కావడం గమనార్హం.