News October 9, 2024

దుర్గమ్మ చెంత కూతురు ఆద్యతో DyCM పవన్ (PHOTOS)

image

విజయవాడలోని కనక దుర్గమ్మను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. కూతురు ఆద్య కొణిదెలతో ఆలయానికి చేరుకొని సరస్వతి దేవిగా దర్శనమిస్తోన్న దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందించి ఇద్దరికీ పట్టు వస్త్రాలు సమర్పించారు. హోమ్ మంత్రి వంగలపూడి అనితతో కలిసి ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు.

Similar News

News July 8, 2025

సిగాచీలో ముగిసిన NDMA బృందం పరిశీలన

image

TG: పాశమైలారంలోని సిగాచీ ఫ్యాక్టరీలో NDMA బృందం పరిశీలన ముగిసింది. ప్రమాద స్థలాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. పేలుడుకు గల కారణాలపై బృందం అధ్యయనం చేసింది. దీనిపై నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయనుంది. కాగా ఈ ఘటనలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 44కు చేరింది. ప్రమాదం జరిగి 9 రోజులవుతున్నా ఇంకా పలువురి ఆచూకీ లభ్యం కాలేదు.

News July 8, 2025

ఇంటర్నెట్ లేకుండా పనిచేసే మెసేజింగ్ యాప్!

image

ట్విటర్ మాజీ CEO జాక్ డోర్సే సరికొత్త మెసేజింగ్ యాప్‌ను రూపొందించారు. ‘బిట్‌చాట్’ పేరుతో రూపొందిన ఈ యాప్‌కు ఇంటర్నెట్, ఫోన్ నంబర్లు, సర్వర్‌లు అవసరం లేదు. కేవలం బ్లూటూత్ నెట్‌వర్క్‌లలో పనిచేసే పీర్-టు-పీర్ మెసేజింగ్ యాప్ ఇది. ప్రస్తుతం ఈ యాప్ టెస్టింగ్ దశలో ఉంది. బిట్‌చాట్ అనేది గోప్యతకు ప్రాధాన్యతనిచ్చే, ఆఫ్-గ్రిడ్ కమ్యూనికేషన్ కోసం రూపొందించినదని జాక్ చెబుతున్నారు.

News July 8, 2025

అంతర్జాతీయ అంపైర్ షిన్వారీ హఠాన్మరణం

image

ప్రముఖ అంతర్జాతీయ అంపైర్ బిస్మిల్లా జన్ షిన్వారీ (41) మరణించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆయన కన్నుమూసినట్లు అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. ఆయన మృతిపట్ల పలువురు క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా 1984లో షిన్వారీ అఫ్గానిస్థాన్‌లో జన్మించారు. తన కెరీర్‌లో 60 అంతర్జాతీయ మ్యాచులకు అంపైర్/టీవీ అంపైర్‌గా పనిచేశారు. ఇందులో 34 వన్డేలు, 26 టీ20లు ఉన్నాయి.