News November 21, 2024
జుట్టుకు రంగులు వేసుకుంటున్నారా?

స్టైల్ కోసం జుట్టుకు పింక్, గ్రీన్, బ్లూ లాంటి వైబ్రంట్ కలర్లను వేసుకోవడం ఇటీవల పెరిగింది. వీటివల్ల తొందరగా గ్రే హెయిర్ వస్తుందని, జుట్టు నెరిసిపోతుందనే వాదన చాలా కాలంగా ఉంది. అయితే దీనికి సైంటిఫిక్ ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు. ‘జన్యుపరం, సూర్యరశ్మి, ఒత్తిడి వల్లే జుట్టు నెరుస్తుంది. రంగులు వేసుకోవడం కారణం కాదు. ఆ కలర్లు జుట్టు పైపొరను మాత్రమే ప్రభావితం చేస్తాయి’ అని స్పష్టం చేస్తున్నారు.
Similar News
News December 1, 2025
చిత్తూరు పీజీఆర్ఎస్కు 232 అర్జీలు

చిత్తూరు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 232 ఫిర్యాదులు అందినట్టు అధికారులు తెలిపారు. రెవెన్యూ సర్వే శాఖకు సంబంధించి 166, పోలీస్ శాఖ-7, పంచాయతీరాజ్-4, ఎండోమెంట్-1, డీపీవో-4, విద్యాశాఖ-2, వ్యవసాయ శాఖ-4, డీఆర్డీఏకి సంబంధించి 21 ఫిర్యాదులు అందాయని వారు తెలిపారు. వీటిని సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.
News December 1, 2025
పానీపూరీ కోసం తెరిచిన నోరు మూసుకోలేదు

UP ఔరైయాలో వింత ఘటన జరిగింది. పానీపూరి తినబోయిన మహిళ దవడ డిస్లొకేట్ అయ్యింది. మేనకోడలు డెలివరీ కోసం ఇంకాలా దేవి ఆస్పత్రికి వెళ్లారు. పిల్లలతో కలిసి ఆవిడ కూడా పానీపూరీ తినేందుకు వెళ్లారు. అయితే ఓ పెద్ద పూరీ తినేందుకు ఆమె నోరు తెరవగా అది తిరిగి మూసుకోలేదు. చివరికి వైద్యులు చికిత్స చేసి దానిని సరి చేశారు. సడెన్గా, ఏదో పెద్ద ఫుడ్ ఐటమ్ తినేందుకు నోరు తెరవడంతో అలా అయ్యిందని చెప్పారు.
News December 1, 2025
42వేల మంది HIV బాధితులకు పెన్షన్లు: సత్యకుమార్

AP: 2030నాటికి HIV రహిత రాష్ట్రమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ‘HIV పాజిటివిటీ రేటు 0.10 శాతం నుంచి 0.04 శాతానికి తగ్గింది. కొత్త కేసుల్లో ITఉద్యోగులు ఉండటం ఆందోళనకరం. సేఫ్ సెక్స్పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. దాదాపు 42వేల మంది HIV బాధితులకు పెన్షన్లు ఇస్తున్నాం. త్వరలో మిగిలిన అర్హులైన వారికీ పెన్షన్ల మంజూరుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని తెలిపారు.


