News August 28, 2024

నేడు ఇ-క్యాబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఛాన్స్!

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఇవాళ ఉదయం 11 గంటలకు ఇ-క్యాబినెట్ భేటీ జరగనుంది. ఇకపై ప్రతి మంత్రివర్గ సమావేశం ఇలాగే నిర్వహిస్తారు. ఎజెండా, నోట్స్.. ఇలా అన్నీ ఆన్‌లైన్‌లోనే ఉంటాయి. ఇవాళ్టి భేటీలో రివర్స్ టెండరింగ్ రద్దు చేసి పాత టెండర్ల విధానం, సాగునీటి సంఘాలకు ఎన్నికలు, ప్రభుత్వ పథకాల అమలు, పోలవరం ఎడమ కాలువకు టెండర్లు తదితర అంశాలపై చర్చించి ఆమోదించే అవకాశం ఉంది.

Similar News

News February 21, 2025

APPLY.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో పోస్టులు

image

బ్యాంక్ ఆఫ్ బరోడాలో వివిధ విభాగాల్లో 518 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. సీనియర్ మేనేజర్ మొదలు క్లౌడ్, ఏఐ ఇంజినీర్ పోస్టుల వరకూ పలు కొలువులు వీటిలో ఉన్నాయి. 22-43 మధ్య వయసుండి డిగ్రీ, బీఈ, సీఏ, బీటెక్, ఎంబీయే విద్యార్హతలున్న వారు సంబంధిత విభాగాల్లో అప్లై చేసుకోవచ్చు. మార్చి 11 తుది గడువు.

News February 21, 2025

24 నుంచి ఆధార్ స్పెషల్ శిబిరాలు

image

AP: ఈ నెల 24-28 వరకు అన్ని జిల్లాల్లో ఆధార్ నమోదుకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుకానున్నాయి. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ కార్యదర్శి శివప్రసాద్ సూచించారు. ఆరేళ్లలోపు చిన్నారుల పేర్లతో కొత్తగా ఆధార్ నమోదు, పాత వాటిలో మార్పులకు ఏర్పాట్లు చేయాలన్నారు. కాగా రాష్ట్రంలో ఆరేళ్లలోపు 8.53L మంది, ఆ పైబడిన వారికి సంబంధించి 42.10L మంది ఆధార్ అప్డేట్ నమోదు పెండింగ్‌లో ఉందన్నారు.

News February 21, 2025

OTTలోకి వచ్చేసిన ‘డాకు మహారాజ్’

image

బాబీ డైరెక్షన్‌లో బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ‘డాకు మహారాజ్’ ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. జనవరి 12న విడుదలైన ఈ చిత్రం దాదాపు రూ.170 కోట్ల కలెక్షన్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. తమన్ మ్యూజిక్ అందించగా, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కీలక పాత్రల్లో నటించారు.

error: Content is protected !!