News December 17, 2024
ACB చేతుల్లోకి ఈ-ఫార్ములా కేసు!
TG: ఈ-ఫార్ములా రేసింగ్‌లో నిధుల దుర్వినియోగంపై విచారణ జరపాలని సీఎస్ శాంతికుమారి ఏసీబీకి లేఖ రాశారు. ఈ కేసుకు సబంధించి ఇటీవల గవర్నర్ ఇచ్చిన అనుమతి లేఖను కూడా జత చేసి పంపారు. కాగా ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ రూ.53 కోట్లను ఓ విదేశీ సంస్థకు ఆర్బీఐ అనుమతులు లేకుండా నేరుగా ట్రాన్స్‌ఫర్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
Similar News
News February 5, 2025
విడదల రజినీపై కేసుకు హైకోర్టు ఆదేశం
AP: మాజీ మంత్రి విడదల రజినీపై 2 వారాల్లోగా కేసు నమోదు చేయాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. కేసు వివరాలను తమకు పంపాలని పేర్కొంది. 2019లో రజినీని ప్రశ్నించినందుకు తనను చిత్రహింసలకు గురి చేశారంటూ పిల్లి కోటి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. తనపై తప్పుడు కేసులు పెట్టించి పోలీసులతో కొట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు రజినీపై కేసు నమోదు చేయకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు.
News February 5, 2025
కొత్త జెర్సీలో భారత ప్లేయర్లు
ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు టీమ్ఇండియా సిద్ధమైంది. కొత్త జెర్సీతో టీమ్ సభ్యులు దిగిన ఫొటోలను బీసీసీఐ షేర్ చేసింది. భుజాల వద్ద జాతీయ జెండా రంగు పెద్దగా కనిపించేలా దీనిని డిజైన్ చేశారు. ఎంతో స్టైలిష్ & క్లాసీ లుక్‌తో ఉన్న జెర్సీలో మన ప్లేయర్లు అదిరిపోయారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రేపు విదర్భ స్టేడియంలో తొలి వన్డే జరగనుంది. జెర్సీ ఎలా ఉందో కామెంట్ చేయండి.
News February 5, 2025
BREAKING: పవన్ కళ్యాణ్‌కు వైరల్ ఫీవర్
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ బారిన పడ్డారు. ఆయన జ్వరంతో పాటు స్పాండిలైటిస్‌తో బాధ పడుతున్నారని ఉపముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారని పేర్కొన్నాయి. దీంతో రేపటి క్యాబినెట్ సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరు కాలేకపోవచ్చని తెలిపాయి.