News March 30, 2024
APR 1 నుంచి ఇ-బీమా.. ప్రయోజనాలివే!

ఏప్రిల్ 1 నుంచి అన్ని పాలసీలను తప్పనిసరిగా డిజిటలైజేషన్ చేయాలని బీమా సంస్థలను IRDAI ఆదేశించింది. ఇకపై ఇ-ఇన్సూరెన్స్ అకౌంట్(EIA) ద్వారా పాలసీలను జారీ చేస్తారు. పేపర్ రహితం కాబట్టి డాక్యుమెంట్లను జాగ్రత్త పరచాల్సిన అవసరం ఉండదు. వినియోగదారులు సులభంగా తమ పాలసీ వివరాలు, చెల్లింపుల తేదీలను ట్రాక్ చేయొచ్చు. పాలసీలో చిరునామా, ఇతర వివరాలను ఈజీగా మార్చుకోవచ్చు. వేగంగా క్లెయిమ్ చేసుకోవచ్చు.
Similar News
News October 22, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 22, బుధవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.58 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.11 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.13 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.50 గంటలకు
✒ ఇష: రాత్రి 7.03 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News October 22, 2025
త్వరలో హోంగార్డు పోస్టుల భర్తీ: DGP

TG: త్వరలోనే హోంగార్డు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రానుందని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. క్రిమినల్ <<18056923>>రియాజ్<<>>ను పట్టుకునే క్రమంలో గాయపడిన సయ్యద్ ఆసిఫ్ను ఆయన పరామర్శించారు. రూ.50వేల రివార్డ్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఆసిఫ్ వల్లే రియాజ్ను పట్టుకున్నట్లు వెల్లడించారు. ఆసిఫ్కు హోంగార్డు ఉద్యోగం కల్పించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.
News October 22, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.