News October 4, 2024
‘దేవర-2’ షూటింగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా: ఎన్టీఆర్

డైరెక్టర్ కొరటాల శివతో తన ప్రయాణం ‘బృందావనం’ సినిమాతో ప్రారంభమైందని, ఇప్పుడు ఆయన తన ఫ్యామిలీ మెంబర్గా మారారని ఎన్టీఆర్ తెలిపారు. ‘దేవర’ సక్సెస్ పార్టీలో ఆయన మాట్లాడారు. ‘ఈ జన్మలో నేను మీ కోసం ఎంత చేసినా అది వడ్డీ మాత్రమే. వచ్చే జన్మలో మీ రుణం తీర్చుకుంటా’ అని ఫ్యాన్స్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘దేవర-2’ షూటింగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.
Similar News
News January 9, 2026
పార్వతీపురం: మన్యం కళావేదిక లోగో ఆవిష్కరణ

మన్యం కళావేదిక లోగోను కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి గురువారం కళాకారులు, సాహితీ వేత్తల మధ్య ఆవిష్కరించారు. జిల్లా ఏర్పడిన తర్వాత సాంస్కృతిక, సాహిత్య రంగాల అభివృద్ధి కోసం జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన మొట్టమొదటి అధికారిక వేదిక ఇదని పేర్కొన్నారు. జిల్లాలోని కళాకారుల నైపుణ్యాన్ని వెలికితీసి, వారిని రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లడమే ఈ కళావేదిక ప్రధాన లక్ష్యమన్నారు.
News January 9, 2026
హజ్ యాత్రకు వీరు అనర్హులు: సౌదీ ప్రభుత్వం

హజ్ యాత్రకు సంబంధించి సౌదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 6 వర్గాల వారికి అనుమతి లేదని స్పష్టం చేసింది. డయాలసిస్ రోగులు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయ వ్యాధులతో బాధపడేవారు, కీమోథెరపీ చేయించుకున్న క్యాన్సర్ రోగులు, వైకల్యంతో ఉన్నవారు, అలాగే 28 వారాలు నిండిన గర్భిణీలను అనర్హులుగా ప్రకటించింది. మరోవైపు ప్రైవేట్ గ్రూపుల ద్వారా వెళ్లేవారు ఈ నెల 15లోపు బుకింగ్లు పూర్తి చేయాలని హజ్ సంఘాలు సూచించాయి.
News January 9, 2026
జనవరి 09: చరిత్రలో ఈరోజు

*ప్రవాస భారతీయుల దినోత్సవం (1915లో మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారత్కు తిరిగివచ్చిన తేదీ)
*1969: మొదటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభం
*1922: నోబెల్ బహుమతి గ్రహీత హరగోవింద్ ఖొరానా జననం (ఫొటోలో)
*1985: తెలుగు జానపద, సినీ గీతరచయిత మిట్టపల్లి సురేందర్ జననం
*1971: బంగారీ మామ పాటల రచయిత కొనకళ్ల వెంకటరత్నం మరణం


