News May 18, 2024
EAPCET ఫలితాల్లో HYD విద్యార్థుల సత్తా
TS EAPCET ఫలితాల్లో HYDకి చెందిన నలురుగు విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన కేటగిరిలో అసిఫ్‌నగర్‌కు చెందిన రేపల సాయి వివేక్(5వ ర్యాంకు), నాచారంకు చెందిన మహమ్మద్ అజాన్ సాద్(6వ ర్యాంకు), పేట్‌బషీరాబాద్‌కు చెందిన భార్గవ్ సుమంత్(8వ ర్యాంకు), కుకట్‌పల్లికి చెందిన ఆదిత్య(9వ ర్యాంకు) సాధించారు. ఈ సందర్భంగా వీరిని కుటుంబీకులు, స్థానికులు అభినందించారు.
Similar News
News December 6, 2024
మేడ్చల్: అవినీతి నిర్మూలనపై వ్యాసరచన పోటీలు
తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా మేడ్చల్ ఇందుస్ యూనివర్సల్ పాఠశాలలో అవినీతి నిర్మూలనపై వ్యాసరచన పోటీలను నిర్వహించారు. భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొని, వారి ప్రతిభను కనబరిచారు. అవినీతి అనేది ఆర్థిక వ్యవస్థను, పాలన వ్యవస్థను చింద్రం చేస్తుందని అన్నారు. ఎవరైనా లంచం అడిగితే 1064కు కాల్ చేయాలన్నారు.
News December 6, 2024
HYD: డా.బి.ఆర్ అంబేద్కర్‌కు నివాళులర్పించిన కేటీఆర్
భారతరత్న డా.బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. తెలంగాణ భవన్‌లో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. దేశం కోసం ఆయన ఎనలేని త్యాగాలు చేశారని, ఆయన ఆశయ సాధనతో ముందుకు వెళ్తామన్నారు.
News December 6, 2024
HYD: యూనివర్సిటీల అభివృద్ధిపై ఫోకస్
HYD యూనివర్సిటీల అభివృద్ధిపై విద్యా కమిషన్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. మౌలిక వసతుల కల్పన, ఖాళీల భర్తీ, పరిశోధనలు, అభివృద్ధి, ఆచార్యులు, విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించడం, ప్రభుత్వ బకాయిలను గుర్తించడంపై పంచసూత్ర ప్రణాళిక రూపొందించింది. ఉస్మానియా, జేఎన్టీయూ లాంటి అనేక యూనివర్సిటీలను అభివృద్ధి చేయనున్నారు.