News February 25, 2025

EAPCET దరఖాస్తుల స్వీకరణ వాయిదా

image

TG: ఇవాళ్టి నుంచి ప్రారంభం కావాల్సిన ఈఏపీసెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ వాయిదా పడింది. మార్చి 1 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు ప్రకటించారు. అదే రోజు నుంచి డీటెయిల్డ్ నోటిఫికేషన్, ఇన్‌స్ట్రక్షన్ బుక్‌లెట్‌ను <>వెబ్‌సైట్‌లో<<>> అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం నేడు సా.4.45 నుంచి అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సిన సంగతి తెలిసిందే.

Similar News

News December 8, 2025

మీ ఫ్రిజ్ ఎక్కువకాలం పనిచేయాలంటే?

image

* ఫ్రిజ్ కంపార్ట్‌మెంట్ టెంపరేచర్‌ను 4°C, ఫ్రీజర్‌ను -18°C వద్ద మెయింటేన్ చేయండి.
* వేడి కంటైనర్లను నేరుగా లోపల పెట్టవద్దు.
* సరిగ్గా డోర్ వేయండి. పదేపదే డోర్ తెరవొద్దు.
* ఫ్రిజ్ కాయిల్స్‌, లోపలి భాగాలను తరచూ క్లీన్ చేయండి.
* ఫ్రిజ్‌ను పూర్తిగా నింపేయకుండా ఖాళీ స్థలాన్ని ఉంచండి.
* ఫ్రిజ్ చుట్టూ కనీసం 10CM స్థలాన్ని వదలండి.
* ఒవెన్స్, డిష్ వాషర్స్, డైరెక్ట్ సన్‌లైట్‌కు దూరంగా ఫ్రిజ్‌ను ఉంచండి.

News December 8, 2025

ఇంటర్వ్యూతో BELలో పోస్టులు

image

HYD-నాచారంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌(<>BEL<<>>) గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. BE, B,Tech, డిప్లొమా ఉత్తీర్ణులైన వారు DEC 9న ఉ. 9.30గం.- 11.30గం. వరకు ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. ముందుగా https://nats.education.gov.in/ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫారమ్ ప్రింట్ ఇంటర్వ్యూకు తీసుకువెళ్లాలి. వెబ్‌సైట్: https://bel-india.in/

News December 8, 2025

T20WC.. ‘స్ట్రీమింగ్’ నుంచి తప్పుకున్న జియోహాట్‌స్టార్!

image

వచ్చే ఏడాది T20WC స్ట్రీమింగ్‌ బాధ్యతల నుంచి జియో హాట్‌స్టార్ తప్పుకున్నట్లు నేషనల్ మీడియా వెల్లడించింది. రెండేళ్ల అగ్రిమెంట్ ఉన్నప్పటికీ తీవ్రమైన ఆర్థిక సమస్యలతో కొనసాగలేమని ICCకి సమాచారం ఇచ్చినట్లు పేర్కొంది. దీంతో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, సోనీ పిక్చర్స్ రేసులోకి వచ్చినట్లు తెలిపింది. ఇదే నిజమైతే టోర్నీ వీక్షించడానికి సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. ప్రేక్షకుల జేబుకు చిల్లు పడటం ఖాయం.