News March 1, 2025
నేటి నుంచి EAPCET దరఖాస్తుల స్వీకరణ

TG: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీలో ప్రవేశాలకు నిర్వహించే EAP-CET దరఖాస్తుల స్వీకరణ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 4వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చని సెట్ కన్వీనర్ దీన్కుమార్ తెలిపారు. గతనెల 25నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కావాల్సి ఉండగా 15% నాన్-లోకల్ కన్వీనర్ కోటా అంశంపై స్పష్టత కోసం ప్రభుత్వం వాయిదా వేసింది. నిన్న దీనిపై <<15604020>>నిర్ణయం<<>> తీసుకోగా నేటి నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తోంది.
Similar News
News March 1, 2025
80% పెన్షన్ల పంపిణీ పూర్తి: TDP

AP: రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పెన్షన్ల పంపిణీ వేగంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పెన్షన్ నగదు పంపిణీ కార్యక్రమం మూడు గంటల్లోనే 80 శాతం పూర్తైనట్లు టీడీపీ ట్వీట్ చేసింది. గత నెల వరకు తెల్లవారుజామున 5 గంటల నుంచే పెన్షన్లు పంపిణీ చేయగా.. ఉద్యోగులు, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పంపిణీ ప్రారంభ సమయాన్ని ప్రభుత్వం 7 గంటలకు మార్చిన విషయం తెలిసిందే.
News March 1, 2025
4 ఎమ్మెల్సీ స్థానాలు.. కాంగ్రెస్లో గట్టి పోటీ

TG: తెలంగాణలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు గాను కాంగ్రెస్కు 4 దక్కే ఛాన్స్ ఉంది. ఇందుకోసం 40 మంది వరకు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. వేం నరేందర్ రెడ్డి, జీవన్ రెడ్డి, జగ్గా రెడ్డి, మధుయాష్కీ, సామ రామ్మోహన్ రెడ్డి, అద్దంకి దయాకర్, సంపత్ కుమార్, రాములు నాయక్, అంజన్ కుమార్ యాదవ్, సరితా యాదవ్ తదితరులు పోటీలో ఉన్నట్లు సమాచారం. యువ నాయకులకు ఛాన్స్ ఇవ్వాలని క్యాడర్ కోరుతోంది.
News March 1, 2025
మూడు రోజుల్లో రూ.1200 తగ్గిన బంగారం ధర

భారీగా పెరిగిన బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గత మూడు రోజుల్లోనే తులం బంగారం ధర రూ.1200 తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.200 తగ్గి రూ.79,400లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.220 తగ్గడంతో రూ.86,620కు చేరింది. అటు వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. కేజీ సిల్వర్ రేటు రూ.1,05,000గా ఉంది.