News April 30, 2024

EAPCET బీటెక్ స్ట్రీమ్ హాల్ టికెట్లు విడుదల

image

TG: ఇంజినీరింగ్, అగ్రికల్చర్-ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఈఏపీసెట్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. నిన్న అగ్రికల్చర్, ఫార్మా విభాగానికి చెందిన హాల్ టికెట్లు అధికారులు విడుదల చేశారు. తాజాగా ఇంజినీరింగ్ స్ట్రీమ్ హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెచ్చారు. విద్యార్థులు ఈ <>లింక్‌<<>>పై క్లిక్ చేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. MPC పాసైన వారు EAPCET రాసేందుకు అవకాశం ఉంటుంది.

Similar News

News March 15, 2026

4 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది!

image

తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కేరళం, అస్సాం, పుదుచ్చేరి (UT) అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ఏప్రిల్ 9న కేరళం, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్ జరగనుంది. వెస్ట్ బెంగాల్‌‌లో ఏప్రిల్ 23, 29న రెండు విడతల్లో, ఏప్రిల్ 23న తమిళనాడులో ఒకే దఫాలో ఎన్నికలు జరగనున్నాయి. అన్నింటి ఫలితాలు మే 4న వెలువడనున్నాయి. 4 రాష్ట్రాలు సహా ఒక UTలో కలిపి 17.4 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు CEC జ్ఞానేశ్ కుమార్ వెల్లడించారు.

News March 15, 2026

‘భీష్మ ప్రతిజ్ఞ’ అంటే ఏమిటి?

image

ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేవాళ్ల గురించి చెప్పే సందర్భంలో ‘భీష్మ ప్రతిజ్ఞ’ నానుడిని వాడతారు. భారతంలో భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు. అతని తండ్రి శంతనుడు దాశరాజు కుమార్తె సత్యవతిని రెండో వివాహం చేసుకోవాలనుకుంటాడు. తన కూతురి కొడుకే రాజు కావాలని దాశరాజు కోరగా తండ్రి ఆనందం కోసం దేవవ్రతుడు అంగీకరించి ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోతారు. అందుకే ఆయనకు భీష్ముడిగా పేరు వచ్చింది.
<<-se>>#EPICSAYINGS<<>>

News March 15, 2026

నన్ను డ్రగ్స్ కేసులోకి లాగితే లీగల్ యాక్షన్ తప్పదు: KTR

image

TG: ప్రతీ డ్రగ్స్ కేసులోకి తనని లాగితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని KTR హెచ్చరించారు. ఎలాంటి టెస్ట్‌కైనా తాను సిద్ధమని పేర్కొన్నారు. డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చిన ప్రతీసారి BRS పార్టీని లాగడం దారుణమన్నారు. తాను, తమ పార్టీ డ్రగ్స్ వాడకానికి పూర్తి వ్యతిరేకమన్నారు. BRS Ex MLA పైలట్ <<19386182>>రోహిత్ రెడ్డి<<>> డ్రగ్స్ కేసులో చిక్కుకున్న నేపథ్యంలో KTR వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.