News March 12, 2025
EAPCET నోటిఫికేషన్ విడుదల

AP: EAPCET <<15723472>>నోటిఫికేషన్‌ను <<>>JNTU కాకినాడ విడుదల చేసింది. దీని ద్వారా ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహిస్తారు. ఈ నెల 15వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుండగా, ఏప్రిల్ 24వ తేదీ వరకు అప్లై చేయవచ్చు. మే 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, 21 నుంచి 27 వరకు ఇంజినీరింగ్ పరీక్షలు జరుగుతాయి.
Similar News
News March 12, 2025
పెండింగ్‌లో 10వేలకు పైగా పిటిషన్లు: రంగనాథ్

TG: అక్రమ కట్టడాలపై హైడ్రాకు పెద్ద ఎత్తున పిటిషన్లు వస్తున్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. ఇప్పటికే 10వేలకు పైగా పిటిషన్లు పరిష్కరించకుండా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఒకప్పటి చెరువుల పరిస్థితి, ప్రస్తుత పట్టణీకరణ, హైడ్రా తీసుకుంటున్నచర్యలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రతి సమస్యను లోతుగా అధ్యయనం చేశాకే పరిష్కారానికి కృషిచేస్తున్నామని వెల్లడించారు. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ రాబోతుందని తెలిపారు.
News March 12, 2025
ఎల్లుండి మద్యం షాపులు బంద్

హైదరాబాద్ వ్యాప్తంగా ఈ నెల 14న మద్యం షాపులు బంద్ కానున్నాయి. హోలీ పండుగ సందర్భంగా ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు షాపులు మూసివేయాలని పోలీస్ శాఖ వెల్లడించింది. మద్యం సేవించి బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డుపై వెళ్లే వారిపై రంగులు చల్లొద్దని, గుంపులుగా ర్యాలీలు నిర్వహించొద్దని పోలీసులు ఆదేశించారు.
News March 12, 2025
త్వరలో పరుగులు పెట్టనున్న హైడ్రోజన్ రైలు

దేశంలో త్వరలో హైడ్రోజన్‌తో నడిచే రైలు అందుబాటులోకి రానుంది. హరియాణా జింద్ నుంచి సోనిపట్ మార్గంలో నడిచే ఈ ట్రైన్‌ను ఈ నెల 31న ప్రారంభించే అవకాశాలున్నాయి. గంటకు 140కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే దీని వాటర్ సామర్థ్యం 40వేల లీటర్లు. ఒకసారి ఫుల్ చేస్తే 1000కిలోమీటర్లు ప్రయాణించగలదు. దేశవ్యాప్తంగా 35రైళ్లను అందుబాటులోకి తేవాలని రైల్వేశాఖ భావిస్తోంది. రీసెర్చ్, డిజైన్, స్టాండర్డ్ సంస్థ తయారు చేసింది.