News April 21, 2025
విద్యార్థుల ఫోన్ నంబర్లకే EAPCET ఫలితాలు

TG: ఈఏపీసెట్ ఫలితాలను విద్యార్థుల ఫోన్ నంబర్లకే పంపాలని జేఎన్టీయూ అధికారులు నిర్ణయించారు. అప్లికేషన్ సమయంలో రిజిస్టర్ చేసుకున్న నంబర్‌కు పంపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈనెల 29, 30 తేదీల్లో అగ్రికల్చర్&ఫార్మసీ, మే 2, 4 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలు జరగనున్నాయి. ఈసారి 3.05 లక్షల మంది విద్యార్థులు EAPCET రాయనున్నారు. పరీక్షల అనంతరం 10 రోజుల్లో ఫలితాలు వచ్చే అవకాశముంది.
Similar News
News November 17, 2025
పాఠ్యపుస్తకంలోని మొదటి పేజీలో ‘జయజయహే తెలంగాణ’: పొంగులేటి

TG: ఇటీవల మరణించిన ప్రజాకవి అందెశ్రీ రుణాన్ని ఉడతాభక్తిగా తీర్చుకోవాలని క్యాబినెట్ నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ఇందులో భాగంగా ఆయన కుమారుడు దత్తసాయికి డిగ్రీ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం ఇస్తామన్నారు. అందెశ్రీ అంత్యక్రియలు జరిగిన ప్రాంతాన్ని స్మృతివనంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. ప్రతి పాఠ్యపుస్తకంలోని మొదటి పేజీలో ‘జయజయహే తెలంగాణ’ గీతాన్ని ముద్రిస్తామని వెల్లడించారు.

పెళ్లి రోజునే మరణశిక్ష విధించారు

బంగ్లాదేశ్ మాజీ PM షేక్ హసీనాకు <<18311087>>ఉరిశిక్ష<<>> విధించిన సంగతి తెలిసిందే. ఈ తేదీతో ఆమెకు మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. 1967లో సరిగ్గా ఇదే తేదీన శాస్త్రవేత్త వాజెద్ మియాను హసీనా పెళ్లి చేసుకున్నారు. దీంతో పెళ్లి రోజునే ఉద్దేశపూర్వకంగా ఆమెకు మరణశిక్ష విధించారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ స్థానిక మీడియా కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించడంతో ఇది రాజకీయ ప్రతీకారమేనని విమర్శిస్తున్నారు.