News June 11, 2024
EAPCET ఫలితాలు విడుదల
AP EAPCET-2024 ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామల రావు ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 3.39 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. WAY2NEWSలో హాల్‌టికెట్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలను చూసుకోవచ్చు.
Similar News
News December 26, 2024
రూ.99 మద్యంలో తగ్గిన నాణ్యత?
AP: కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన రూ.99కే క్వార్టర్ మద్యంలో కాస్త నాణ్యత లోపించిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఆల్కహాల్ శాతం అలాగే ఉన్నా రుచిలో కొంత వ్యత్యాసం కనిపిస్తోందని పలువురు వినియోగదారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఒకట్రెండు ఫేమస్ బ్రాండ్లు నాణ్యతలో రాజీపడుతున్నట్లు సమాచారం. అయితే ప్రమాణాలకు అనుగుణంగా మద్యం ఉండటంతో ఎక్సైజ్ శాఖ ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది.
News December 26, 2024
వైకుంఠ ఏకాదశి: ఆ పది రోజులు వారికి నో ఎంట్రీ
AP: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల్లో జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి 9న ఉ.5 గంటల నుంచి 1.20 లక్షల టోకెన్లు ఇస్తామని TTD ఈవో శ్యామలరావు చెప్పారు. సామాన్యులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. మిగతా తేదీలకు ఒక రోజు ముందుగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. టోకెన్లు లేని వారికి ఈ పది రోజుల్లో శ్రీవారి దర్శనానికి అనుమతించబోమని తెలిపారు. జనవరి 10-19 వరకు వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తారు.
News December 26, 2024
కొత్త ఇల్లు కట్టుకునే వారికి GOOD NEWS
TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. 4 విడతల్లో రూ.5 లక్షల ఆర్థికసాయంతో పాటు తక్కువ ధరకే సిమెంట్, ఇసుక, స్టీల్ అందజేయాలని సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో బస్తా సిమెంట్ ధర రూ.260, టన్ను స్టీల్ రూ.54 వేల వరకు ఉంది. ధర తగ్గించేందుకు కంపెనీలతో చర్చలు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ఇసుక ఇప్పటికే ప్రభుత్వ అధీనంలో ఉంది.