News February 3, 2025

EAPCET షెడ్యూల్ ఖరారు

image

తెలంగాణ EAPCET షెడ్యూల్ ఖరారైంది. మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష, ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్షలు నిర్వహించనుంది. ఈ నెల 20న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా, ఫిబ్రవరి 25 నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈసారి EAPCETను JNTUH నిర్వహిస్తోంది.

Similar News

News January 14, 2026

ఇంటర్ ఫస్టియర్‌లోనే ఎంట్రన్స్ ఎగ్జామ్స్!

image

ఇంటర్ పూర్తయ్యాక నిర్వహించే ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌ను ఫస్టియర్/11వ తరగతిలోనే జరిపే ప్రతిపాదనపై కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ కసరత్తు చేస్తోంది. విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడి తగ్గించడం, కోచింగ్ సెంటర్ల ఆగడాలకు అడ్డుకట్టవేసేందుకు ఈ దిశగా ఆలోచిస్తోంది. అలాగే ఇంటర్ పరీక్షలను మల్టిపుల్ ఛాయిస్ తరహా విధానంలో నిర్వహించడం, బోర్డు పరీక్షల్లో వచ్చిన మార్కులకు వెయిటేజీ ఇవ్వడంపైనా ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.

News January 14, 2026

రేపు, ఎల్లుండి విజయ్‌ హజారే ట్రోఫీ సెమీఫైనల్స్

image

విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్‌, విదర్భ, కర్ణాటక, సౌరాష్ట్ర జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధించాయి. నిన్నటి క్వార్టర్‌ఫైనల్లో పంజాబ్‌ 183 పరుగుల తేడాతో MPపై ఘన విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో విదర్భ 76 పరుగులతో ఢిల్లీని ఓడించింది. దీంతో రేపు జరిగే సెమీఫైనల్లో విదర్భ-కర్ణాటక తలపడనుండగా, ఎల్లుండి పంజాబ్‌-సౌరాష్ట్ర మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ రెండు మ్యాచ్‌లలో విజయం సాధించిన టీమ్‌లు 18న ఫైనల్లో తలపడనున్నాయి.

News January 14, 2026

నిష్క్రమిస్తోన్న ఈశాన్య రుతుపవనాలు

image

AP: ఈశాన్య రుతుపవనాలు 3 రోజుల్లో తమిళనాడు, కోస్తాంధ్ర, రాయలసీమ, కేరళ, కర్ణాటక ప్రాంతాల నుంచి నిష్క్రమించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గాలుల దిశలో మార్పుతో క్రమంగా వైదొలుగుతాయని పేర్కొంది. మరోవైపు కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది. శివారు ప్రాంతాలు, ఏజెన్సీల్లో మంచు కురుస్తోంది. రాబోయే రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశముందని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.