News May 24, 2024

ఈఏపీసెట్.. నేడు బీటెక్ స్ట్రీమ్ ‘కీ’ విడుదల

image

APEAPCET పరీక్షలు నిన్నటితో ముగిశాయి. ఇంజినీరింగ్ విభాగంలో 2,74,213 మందికి గాను 2,58,373 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 88,638 మందికి గాను 80,766 మంది పరీక్ష రాసినట్లు సెట్ ఛైర్మన్ తెలిపారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్ విడుదల చేయగా.. 25వ తేదీ ఉదయం 10 గంటల వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఇంజినీరింగ్ విభాగం కీ ఇవాళ రిలీజ్ చేస్తారు. 26 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు.

Similar News

News January 2, 2026

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ రూ.1,140 పెరిగి రూ.1,36,200కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,050 ఎగబాకి రూ.1,24,850 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.4,000 పెరిగి రూ.2,60,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News January 2, 2026

కాంగ్రెస్, BRS క్షమాపణ చెప్పాలి: బండి సంజయ్

image

TG: కృష్ణా జలాల వ్యవహారంలో కాంగ్రెస్, BRS తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రంపై బురద జల్లుతున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైరయ్యారు. ‘కృష్ణా జలాల్లో 299 TMCలు చాలని KCR సంతకం చేసింది నిజమే. పాలమూరు ప్రాజెక్టుపై కేంద్రం అడిగిన నీటి వివరాలివ్వకుండా రెండు ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. అందుకే DPRను కేంద్రం వెనక్కు పంపింది. చేసిన అన్యాయంపై కాంగ్రెస్, BRS క్షమాపణ చెప్పాలి’ అని పేర్కొన్నారు.

News January 2, 2026

APPLY NOW: బాల్మర్ లారీలో ఉద్యోగాలు

image

బాల్మర్ లారీ‌లో 18 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే(JAN 4) ఆఖరు తేదీ. పోస్టును బట్టి MTM, MBA, BE/B.Tech,డిగ్రీ, MCA ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, రాతపరీక్ష/ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.balmerlawrie.com