News June 14, 2024
గతంలో ఐదుగురు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక్కరే

AP డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉండనున్నారు. పవన్ గౌరవం తగ్గించకూడదనే ఉద్దేశంతో మరెవరికీ ఈ పదవిని చంద్రబాబు కేటాయించలేదు. జగన్ ప్రభుత్వంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉండగా, ఈ సారి పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉన్నారు. డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు జనసేనానికి దక్కాయి.
Similar News
News September 13, 2025
రివర్స్ కండీషనింగ్ గురించి తెలుసా?

సాధారణంగా తలస్నానం చేశాక కండీషనర్ రాస్తారు. కానీ ముందుగా కండీషనర్ అప్లై చేసి, తర్వాత షాంపూతో హెయిర్ వాష్ చేసే ప్రక్రియను రివర్స్ కండీషనింగ్ అంటారు. దీని వల్ల ఎన్నో లాభాలున్నాయంటున్నారు నిపుణులు. ఈ టెక్నిక్ స్కాల్ప్‌ను క్లీన్ చేసి జుట్టును హెల్తీగా, హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. అలాగే కుదుళ్లు బలంగా ఉండేలా చేస్తుంది. దీనికోసం సల్ఫేట్‌లు, పారాబెన్, సిలికాన్ లేని మాయిశ్చరైజింగ్ కండీషనర్‌ను ఎంచుకోవాలి.
News September 13, 2025
తిరుపతిలో జాతీయ మహిళా సాధికారత సదస్సు

తిరుపతి వేదికగా ఈనెల 14, 15 తేదీల్లో మహిళా సాధికారత జాతీయ సదస్సు జరగనుంది. తిరుచానూరులోని రాహుల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే ఈ సదస్సుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. దేశం నలుమూలల నుంచి 250 మందికిపైగా మహిళా ప్రతినిధులు వస్తున్నారు. ఇందులో మహిళా రాజకీయ ప్రాతినిధ్యం, ఆర్థిక సాధికారత-పెరుగుతున్న అవకాశాలు, ‘నాయకత్వం, చట్టాల్లో మహిళల పాత్ర’పై వక్తలు ప్రసంగించనున్నారు.
News September 13, 2025
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు.. విజిలెన్స్‌కు ACB రిపోర్ట్

TG: ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు నివేదికను ఏసీబీ విజిలెన్స్ కమిషన్‌కు అప్పగించింది. రెండు రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి అందజేయనున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి తిరిగి ఏసీబీకి రిపోర్ట్ చేరుతుంది. ఐఏఎస్ అధికారి అరవింద్, బీఎల్ఎన్ రెడ్డి ప్రాసిక్యూషన్‌పై తుది నివేదిక వచ్చాక ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది నిర్ణయించే అవకాశముంది.