News December 16, 2024
జర్మనీలో ముందస్తు ఎన్నికలు.. అవిశ్వాస తీర్మానంలో ఓడిన షోల్జ్

అవిశ్వాస తీర్మానంలో జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ ఓటమి పాలయ్యారు. దీంతో Feb 23న ఆ దేశంలో ముందస్తు ఎన్నికలు జరగనున్నాయి. సోషల్ డెమోక్రటిక్ పార్టీ రాజకీయ స్థిరత్వం కోసం షోల్జ్ ఈ ఓటమిని స్వయంగా కోరుకోవడం గమనార్హం. Novలో 3 పార్టీల సంకీర్ణ ప్రభుత్వం కూలడంతో విపక్షాల మద్దతుతోనే ఆయన ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. దేశ రాజకీయ దిశను ఇప్పుడు ఓటర్లే నిర్ణయిస్తారని షోల్జ్ పేర్కొన్నారు.
Similar News
News December 5, 2025
నటుడు క్యారీ-హిరోయుకి తగావా కన్నుమూత

హాలీవుడ్ నటుడు క్యారీ-హిరోయుకి తగావా(75) కన్నుమూశారు. స్ట్రోక్ సంబంధిత సమస్యలతో ఆయన చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. జపాన్‌లో జన్మించిన ఆయన అమెరికన్, రష్యన్ యాక్టర్‌గా గుర్తింపు పొందారు. మోర్టల్ కోంబాట్, ది లాస్ట్ ఎంపరర్, లైసెన్స్ టు కిల్, ది మ్యాన్ ఇన్ ది హై కాజిల్, లాస్ట్ ఇన్ స్పేస్ వంటి సినిమాలు, సిరీస్‌లతో పాపులర్ అయ్యారు. విలన్ పాత్రల్లో ఎక్కువగా కనిపించారు.
News December 5, 2025
స్క్రబ్ టైఫస్ వ్యాధిని ఈ లక్షణాలతో గుర్తించండి

AP: స్క్రబ్ టైఫస్‌ను వ్యాప్తి చేసే చిగ్గర్ పురుగు మనిషిని కుట్టినచోట నల్లని మచ్చ, దద్దుర్లు ఏర్పడతాయి. తర్వాత తీవ్రమైన జ్వరం, చలి, ఒళ్లు నొప్పులు ఉంటాయి. తలనొప్పి, అలసట, వాంతులు, విరేచనాలు లక్షణాలు కనిపిస్తాయి. సకాలంలో గుర్తించి చికిత్స అందించకపోతే ఊపిరితిత్తులు, కిడ్నీలు, మెదడు, కాలేయం, ఇతర అవయవాలపై ప్రభావం చూపి రోగి క్రమంగా కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఇది అంటువ్యాధి కాదని వైద్యులు తెలిపారు.
News December 5, 2025
బ్యాగ్ కొనే ముందు..

ఒకప్పుడు హ్యాండ్ బ్యాగ్ అలంకారమే కావొచ్చు. కానీ ఇప్పుడు అవసరం. అందుకే దీన్ని ఎంచుకొనేటప్పుడు టిప్స్ పాటించాలంటున్నారు నిపుణులు. బ్యాగు కొనేముందు ఏ అవసరానికి కొంటున్నారో స్పష్టత ఉండాలి. అందులో పెట్టే వస్తువులను బట్టి దాని పరిమాణం ఉండాలి. అంతేకాకుండా అది మీ శరీరాకృతికి నప్పేలా ఉండాలి. పొట్టిగా ఉన్నవారికి పెద్ద బ్యాగులు అంతగా నప్పవు. నాణ్యత బాగుండాలి. లోపలి లైనింగ్ వాటర్ ప్రూఫ్ అయి ఉంటే మరీ మంచిది.


