News September 3, 2025
వంగ, బెండలో తొలి దశలో చీడపీడల నివారణ

వంగ, బెండ మొక్కలపై తొలి దశలో అక్షింతల పురుగు, పెంకు పురుగులను గమనిస్తే ఏరి చంపేయాలి. కొమ్మతొలుచు పురుగు ఆశించిన రెమ్మలను కింది వరకు తుంచి నాశనం చేయాలి. పంట కాపునకు ముందు దశలో పురుగుల నివారణకు లీటరు నీటికి 2.5ml క్లోరిపైరిపాస్, 2.5ml క్వినాల్‌ఫాస్, 2ml ప్రొఫెనోఫాస్ మందులలో ఏదో ఒకదానిని 5ml వేపమందుతో కలిపి స్ప్రే చేయాలి. అవసరాన్ని బట్టి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో మందు మార్చి మరోసారి స్ప్రే చేయవచ్చు.
Similar News
News February 20, 2026
జుట్టు జిడ్డు ఇలా తగ్గిద్దాం..

కాలుష్యం, దుమ్మూ తోడై కొందరి జుట్టు త్వరగా జిడ్డుగా మారుతుంది. దానికోసం ఈ చిట్కాలు.. * షాంపూలో స్పూన్ కలబంద, కాస్త నిమ్మరసం చేర్చి బాగా కలిపి తలకు పెట్టుకోవాలి. ఈ మిశ్రమంతో వారానికి రెండుసార్లు తలస్నానం చేయాలి. * రెండు స్పూన్ల ముల్తానీమట్టికి తగినంత నీరు కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. * తలస్నానం చేసిన జుట్టుకు బ్లాక్ టీని పట్టించి ఇరవైనిమిషాల తర్వాత కడిగేయాలి.
News February 20, 2026
జప మాలను మెడలో ధరించవచ్చా?

జపానికి వాడే మాలను మెడలో ధరించకూడదని పండితులు సూచిస్తున్నారు. కేవలం జపం కోసమే ప్రత్యేకంగా ఉంచాలని చెబుతున్నారు. జపమాలకు సంబంధించి కొన్ని నియమాలు.. భగవంతుని శక్తిని జాగృతం చేసే జపంలో ఏకాగ్రత ముఖ్యం. జపమాల 108 పూసలతో ఉండటం ఉత్తమం. 54, 27 లేదా 9 పూసలున్న మాలలను కూడా వాడొచ్చు. రుద్రాక్ష, తులసి వంటి పదార్థాలు మంత్ర శక్తిని శరీరంలోకి చేరవేసే వాహకాలుగా పనిచేస్తాయి.
News February 20, 2026
DSSSB 911పోస్టులకు నోటిఫికేషన్

ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్(DSSSB) 911 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు FEB 24 నుంచి మార్చి 25 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి LLB, BE/BTech(సివిల్ Engg.), డిప్లొమా(సివిల్ Engg.), డిగ్రీ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.100. SC, ST, PwBDలకు ఫీజు లేదు. రాత పరీక్ష(టైర్1, టైర్2) ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: dsssb.delhi.gov.in/


