News April 1, 2024
రూ.లక్షలు సంపాదిస్తున్నా పెళ్లిళ్లు కావట్లేదు..
కుల, మతాలు, ఆర్థిక స్థితిగతులు వివాహాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. 30-35 ఏళ్లు దాటినా పెళ్లిళ్లు కావట్లేదు. అబ్బాయికి నెలకు రూ.లక్షల జీతం వస్తున్నా.. కుటుంబ ఆస్తులు లేవని అమ్మాయిలు తిరస్కరిస్తున్నారట. మెడిసిన్ చదివిన అబ్బాయిలు తక్కువగా ఉండటంతో MBBS, MD చదివిన అమ్మాయిలకు వివాహాలు ఆలస్యమవుతున్నాయి. ఒకే రంగంలో ఉద్యోగం చేస్తున్నవారినే భాగస్వామిని చేసుకోవాలనే కోరికా వివాహాలపై ప్రభావం చూపుతోంది.
Similar News
News November 7, 2024
గోవాకు విదేశీయుల తాకిడి తగ్గుతోంది!
విహారం, విడిది కోసం గోవాకు వచ్చే విదేశీయుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. కరోనా ప్యాండమిక్ తరువాత ఈ ట్రెండ్ పెరిగింది. 2019లో గోవాకు 9.4 లక్షల మంది విదేశీయులు విచ్చేశారు. అయితే 2023లో ఆ సంఖ్య 4.03 లక్షలకు తగ్గింది. ఇది 60 శాతం తగ్గుదలను సూచిస్తోంది. గోవాలో ట్యాక్సీ మాఫియా వల్ల కొందరు విదేశీయులు దోపిడీకి గురయ్యామని భావించడం, ఇతరత్రా అసౌకర్యాల వల్ల గోవా రావడం తగ్గించినట్టు తెలుస్తోంది.
News November 7, 2024
పోటీ చేయలేక పారిపోయిన జగన్ ముఠా: TDP
AP: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయబోమని వైసీపీ నేత <<14551662>>పేర్ని నాని ప్రకటించడంపై<<>> టీడీపీ వ్యంగ్యస్త్రాలు సంధించింది. ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ నుంచి జగన్ రెడ్డి ముఠా పారిపోయిందని ట్వీట్ చేసింది. ఈవీఎంలపై నమ్మకం లేదని చెప్పి, బ్యాలెట్ ద్వారా జరుగుతున్నా పారిపోతున్నారని దుయ్యబట్టింది. ఎలాగూ ఓట్లు రావనే జగన్ రెడ్డి డిసైడ్ అయ్యి పోటీ చేయట్లేదని పేర్కొంది.
News November 7, 2024
HYDలో రెసిడెన్షియల్ సేల్స్ పెరుగుదల: స్క్వేర్ యార్డ్స్
2024 జులై-సెప్టెంబర్‌లో HYDలో రెసిడెన్షియల్ సేల్స్ 20%, లావాదేవీలు 7% పెరిగాయని స్క్వేర్ యార్డ్స్ సంస్థ తెలిపింది. గత ఏడాది జులై-సెప్టెంబర్(18,314)తో పోలిస్తే ఈ ఏడాది(19,527) ట్రాన్సక్షన్స్‌లో పెరుగుదల కనిపించిందని పేర్కొంది. మొత్తం రిజిస్టర్డ్ సేల్స్ విలువ ₹11,718కోట్లకు చేరిందని తెలిపింది. యావరేజ్ రిజిస్టర్డ్ హోమ్ సేల్స్ వాల్యూ ₹60లక్షలుగా ఉందని, వార్షిక వృద్ధి 13%గా నమోదయిందని వివరించింది.