News October 3, 2025
పిల్లలకు పేర్లు సూచిస్తూ రూ.లక్షల్లో సంపాదన

ట్రెండ్‌కు తగ్గట్లు పేరు పెట్టడం కత్తిమీద సామే. అందుకే అలాంటి పేర్లను వెతికి సూచించే ఓ జాబ్ ఉందనే విషయం మీకు తెలుసా? USAలో ‘బేబీ నేమర్’ అనే ప్రత్యేకమైన ఉద్యోగం ఉంది. టేలర్ A. హంఫ్రీ అనే మహిళ పదేళ్ల క్రితం సరదాగా ఈ వృత్తిని స్టార్ట్ చేసి 2020లో ఒక్కో క్లయింట్ నుంచి $1,500 వసూలు చేశారు. ప్రస్తుతం సంపన్నుల పిల్లలకు పేర్లు పెట్టి లక్షలు పొందుతున్నారు. ఇలా నెలకు $30K(రూ.26లక్షలు) సంపాదిస్తున్నారు.
Similar News
News October 3, 2025
అమరావతిలో పెట్టుబడులకు మలేషియా సంస్థల ఆసక్తి

AP: మలేషియా సెలంగోర్ EX CO మెంబర్ పప్పారాయుడు, క్లాంగ్ ఎంపీ గణబతిరావ్, మలేషియా-ఆంధ్ర బిజినెస్ ఛాంబర్ ప్రతినిధులతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. అమరావతిని రెండున్నరేళ్లలో పూర్తిచేస్తామని తెలిపారు. ప్రపంచంలోనే టాప్ 5 నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దడమే CBN లక్ష్యమని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో ₹10వేల కోట్లతో పలు ప్రాజెక్టుల ప్రతిపాదనల్ని ప్రతినిధులందించారు. అంతకు ముందు వారు అమరావతిలో పర్యటించారు.
News October 3, 2025
CSIR-IICTలో ఉద్యోగాలు

CSIR-IICT 7 సైంటిస్టు పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు అక్టోబర్ 30వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32 ఏళ్లు. పోస్టును బట్టి పీహెచ్‌డీ, ఎంటెక్/ఎంఈ, ఎంఫిల్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.iict.res.in/CAREERS
News October 3, 2025
విజయ్ వాహనాన్ని ఎందుకు సీజ్ చేయలేదు: మద్రాస్ HC

తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటన దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. టీవీకే చీఫ్ విజయ్ వాహనాన్ని ఎందుకు సీజ్ చేయలేదని పోలీసులను ప్రశ్నించింది. ఘటన తర్వాత ఆ పార్టీ నేతలంతా ఎక్కడికి వెళ్లారని, బాధితులను ఎందుకు పట్టించుకోలేదని నిలదీసింది. ఘటనపై సిట్ దర్యాప్తు కొనసాగించాలని ఆదేశించింది. టీవీకే నేతల ముందస్తు బెయిల్ తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది.