News October 9, 2024

రూ.కోట్లల్లో మూవీ స్టార్స్ మేనేజర్స్ సంపాదన

image

సినీతారల డేట్స్, ప్రమోషన్స్, బిజినెస్ చూసేందుకు వారికి మేనేజర్స్ ఉంటారనే విషయం తెలిసిందే. స్టార్స్ ఎదుగుదలలో కీలకంగా ఉండే మేనేజర్లకు కూడా భారీగా జీతాలుంటాయని సినీవర్గాలు పేర్కొన్నాయి. ‘షారుఖ్ ఖాన్ మేనేజర్‌ పూజా దద్లానీ ఏడాదికి రూ.7-9 కోట్లు, అంజుల ఆచార్య (ప్రియాంక చోప్రా) రూ.6కోట్లు సంపాదిస్తున్నారు. గతంలో పూనమ్(కరీనా) రూ.3 కోట్లు, సుసాన్(రణ్‌వీర్ సింగ్) రూ.2కోట్లు ఛార్జ్ చేసేవారు’ అని తెలిపాయి.

Similar News

News January 4, 2026

ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇండియాలో పోస్టులు

image

ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (<>EdCIL<<>>) 15 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. BBA, BA, BCom, B.Tech/BE, CA అర్హతగల వారు జనవరి 19 వరకు NATS పోర్టల్‌లో ఎన్‌రోల్ చేసుకోవాలి. వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు స్టైపెండ్ రూ.15వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: www.edcilindia.co.in

News January 4, 2026

‘జెలెన్‌స్కీని పుతిన్ బంధిస్తే?’.. ట్రంప్‌పై రో ఖన్నా ఫైర్!

image

వెనిజులా అధ్యక్షుడు మదురో అరెస్ట్‌ను భారత సంతతి US MP రో ఖన్నా తప్పుబట్టారు. ఇది ఒక అనవసర యుద్ధమని విమర్శించారు. ‘ఇలాంటి దాడుల వల్ల ప్రపంచానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. రేపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని పుతిన్ బంధిస్తే? లేదా తైవాన్ నేతలపై చైనా దాడి చేస్తే అప్పుడు మనం ఏమనగలం?’ అని ప్రశ్నించారు. ఈ చర్య వల్ల అంతర్జాతీయ వేదికపై అమెరికా నైతిక బలాన్ని కోల్పోతుందని రో ఖన్నా అభిప్రాయపడ్డారు.

News January 4, 2026

మదురోను బంధించిన డెల్టా ఫోర్స్.. అసలు ఎవరీ కిల్లర్ టీమ్?

image

US సైన్యంలో అత్యంత రహస్యమైన, పవర్‌ఫుల్ విభాగం డెల్టా ఫోర్స్. 1977లో బ్రిటీష్ SAS స్ఫూర్తితో దీన్ని స్థాపించారు. ఇందులో చేరడం చాలా కష్టం. వీరు యూనిఫామ్ ధరించకుండా సాధారణ పౌరుల్లా ఉంటూ రహస్య ఆపరేషన్లు చేస్తారు. సద్దాం హుస్సేన్ పట్టివేత, అల్ బగ్దాదీ హతం తాజాగా మదురో అరెస్ట్ వంటి మిషన్లు వీరే చేశారు. అత్యాధునిక ఆయుధాలు, నైట్ విజన్ టెక్నాలజీతో శత్రువులకు చిక్కకుండా మెరుపు దాడి చేయడం వీరి స్పెషాలిటీ.