News September 11, 2024

ఢిల్లీలో భూకంపం.. పోలీసుల సూచనలివే!

image

ఢిల్లీ, NCRలో భూమి కంపించడంతో ఉత్తర భారతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.8గా నమోదైంది. ఈక్రమంలో ప్రజలు భయపడొద్దని ఢిల్లీ పోలీసులు సూచించారు. ‘ఢిల్లీ ప్రజలారా.. మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాం. దయచేసి మీ భవనాల నుంచి సురక్షితమైన ప్రదేశానికి వెళ్లండి. కానీ, భయపడొద్దు. ఎలివేటర్లను ఉపయోగించవద్దు. అత్యవసరమైతే 112కి కాల్ చేయండి’ అని ట్వీట్ చేసింది.

Similar News

News December 4, 2025

HYD: IITల్లో నీటిని ఒడిసిపట్టే చెరువు

image

రోజు రోజుకు పెరుగుతున్న పట్టణీకరణతో వర్షపు నీటిని ఒడిసిపట్టే పరిస్థితి తగ్గుతోంది. దీంతో ఎండాకాలంలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన IIT HYD విద్యా సంస్థ 654 ఎకరాల ప్రాంగణంలో లోలెవెల్ ఏరియాలో చెరువును అందుబాటులోకి తెచ్చింది. అక్కడ కురిసిన వర్షపు నీరు మొత్తం ఇందులోకి వచ్చి చేరుతుంది. దీని కెపాసిటీ 2.28 కోట్ల లీటర్లుగా అధికారులు తెలిపారు.

News December 4, 2025

CBSE నోటిఫికేషన్.. 124 పోస్టులు

image

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 124 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అసిస్టెంట్ సెక్రటరీ, అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్, జూనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి ఇంటర్, డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంఏ పాసై ఉండాలి. వయసు 27-35 ఏళ్లు. <>దరఖాస్తుకు<<>> చివరి తేదీ: డిసెంబర్ 22.

News December 4, 2025

రైతన్నా.. పంట వ్యర్థాలను తగలబెట్టొద్దు

image

పంటకాలం పూర్తయ్యాక చాలా మంది రైతులు ఆ వ్యర్థాలను తగలబెడుతుంటారు. వీటిని తొలగించడానికి అయ్యే ఖర్చును భరించలేక ఇలా చేస్తుంటారు. అయితే దీని వల్ల నేల సారం దెబ్బతినడంతో పాటు పంటకు మేలు చేసే కోట్ల సంఖ్యలో సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వానపాములు, నులిపురుగులు నాశనమవుతాయి. ఫలితంగా పంట దిగుబడి తగ్గుతుంది. ఈ వ్యర్థాలను పంటకు మేలు చేసే ఎరువులుగా మార్చే సూచనల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.