News February 26, 2025
ఇండోనేషియాలో భూకంపం

ఇండోనేషియాలోని సులవేసి ప్రావిన్స్‌లో భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం ఉ.6.55 గంటలకు 6.1 తీవ్రతతో భూమి కంపించింది. అయితే భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని జకర్తా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. 2018లో సులవేసిలో భారీ భూకంపంతో 2,200 మంది, 2021 జనవరిలో 100 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు నిన్న కోల్‌కతా, ఒడిశాలోని భువనేశ్వర్ సమీపంలోని బంగాళాఖాతంలో భూకంపం వచ్చింది.
Similar News
News February 26, 2025
మళ్లీ థియేటర్లలోకి బ్లాక్ బస్టర్ సినిమా

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘ఆదిత్య 369’ మళ్లీ థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. 1991లో విడుదలైన ఈ చిత్రం రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ సమ్మర్లో ఈ మూవీని రీరిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటన చేశారు. కాగా, ‘ఆదిత్య 369’కు సీక్వెల్ తీయనున్నట్లు ఇప్పటికే బాలయ్య ప్రకటించారు.
News February 26, 2025
ఉద్యోగుల రాజీనామా.. మస్క్ దూకుడుకు బ్రేక్?

ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్‌కు చెందిన 21మంది ఉద్యోగులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఫెడరల్ ఉద్యోగుల తొలగింపులో తాము భాగస్వామ్యం కాలేమని తెలిపారు. డోజ్‌లో రాజకీయ ఉద్దేశ్యాలున్న వారే అధికంగా ఉన్నారని వారికి ఉద్యోగం చేయడానికి కావాల్సిన నైపుణ్యాలు లేవని ఆరోపించారు. ఈ రాజీనామాలతో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్న మస్క్, ట్రంప్ ద్వయానికి షాక్ తగిలిందని అంతా భావిస్తున్నారు.
News February 26, 2025
పెళ్లి చేసుకోవాలని ఉంది: సుస్మితా సేన్

మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్(49) పెళ్లిపై మనసులోని మాటను బయటపెట్టారు. తనకు పెళ్లి చేసుకోవాలని ఉందన్నారు. అయితే అది ఈజీగా జరిగే ప్రక్రియ కాదన్నారు. అది రొమాంటిక్‌గా, 2 హృదయాల కలయిక వల్ల జరుగుతుందని చెప్పారు. అలా అనిపించినప్పుడు పెళ్లి చేసుకుంటానని తెలిపారు. నటుడు రొహ్మన్ షాల్‌తో సుస్మిత 3ఏళ్లు డేటింగ్ చేసి 2021లో విడిపోయారు. ఆ తర్వాత లలిత్ మోదీతో లవ్‌లో ఉన్నట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే.