News March 30, 2025

ఇండోనేషియాలోనూ భూకంపం

image

ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రా ప్రాంతంలో ఈరోజు ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రత నమోదైందని ఆ దేశ భూకంప పరిశీలన కేంద్రం తెలిపింది. భూ ఉపరితలానికి 18 కి.మీ లోతున భూకంప కేంద్రం నెలకొని ఉందని పేర్కొంది. థాయ్‌లాండ్‌, మయన్మార్ దేశాలను భారీ భూకంపం కుదిపేసిన రోజుల వ్యవధిలోనే తమ వద్దా భూకంపం రావడంతో ఇండోనేషియావాసులు నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.

Similar News

News April 1, 2025

కాకాణి గోవర్ధన్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు

image

AP: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై SC, ST కేసు నమోదైంది. గిరిజనులను బెదిరించినట్లు నెల్లూరు (D) పొదలకూరులో PSలో కేసు నమోదు చేశారు. అటు మైనింగ్ కేసులో ఇవాళ 11 గంటలకు విచారణకు రావాలని నిన్న పోలీసులు నోటీసులు ఇవ్వగా.. ఆయన గైర్హాజరయ్యారు. ప్రస్తుతం నెల్లూరు, హైదరాబాద్‌లో కాకాణి అందుబాటులో లేరని తెలుస్తోంది. మరోవైపు, ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది.

News April 1, 2025

SMలో HCU భూములపై క్యాంపెయిన్

image

HCU భూములను వేలం వేయొద్దని, ప్రకృతిని కాపాడాలంటూ SMలో నెటిజన్లు క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ప్రకృతి ప్రేమికులు చేస్తున్న ఈ ప్రచారంలో వేలాది మంది పాల్గొంటున్నారు. SAVE FOREST, SAVE HCU BIODIVERSTY అంటూ SMలో గళమెత్తుతున్నారు. ఈ ఇన్‌స్టా క్యాంపెయిన్‌లో ఇప్పటికే 10వేల మంది తమ మద్దతు తెలియజేశారు. ప్రతిపక్ష పార్టీలు సైతం HCU భూముల వేలంపై వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నాయి. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి?

News April 1, 2025

MARCH: రికార్డు స్థాయిలో UPI పేమెంట్స్

image

దేశంలో డిజిటల్ పేమెంట్స్ సరికొత్త గరిష్ఠాలను తాకాయి. మార్చిలో రూ.24.77లక్షల కోట్ల UPI పేమెంట్స్ జరిగినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) వెల్లడించింది. 18.3 బిలియన్ల ట్రాన్సాక్షన్స్ నమోదయ్యాయంది. వరుసగా 11 నెలల నుంచి ప్రతినెలా రూ.20లక్షల కోట్లకు పైగా పేమెంట్స్ జరగడం విశేషం. JAN-MAR క్వార్టర్‌లో రూ.70.2లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయి. గతేడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే ఇది 24% అధికం.

error: Content is protected !!