News June 26, 2024
మణిపుర్లో భూకంపం

మణిపుర్లో భూకంపం ప్రకంపనలు రేపింది. బిష్ణుపుర్‌లో రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.5గా నమోదైనట్లు భూకంప అధ్యయన కేంద్రం తెలిపింది. 25 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు పేర్కొంది. ఈ ప్రభావం పొరుగు దేశాలైన మయన్మార్, బంగ్లాదేశ్‌లోనూ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆస్తి నష్టం, ప్రాణ నష్టంపై సమాచారం లేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 16, 2026
APFIRST పేరుతో తిరుపతిలో రీసెర్చ్ సెంటర్

AP ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ(APFIRST) పేరిట తిరుపతిలో రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు కానుంది. ఏరో స్పేస్-డిఫెన్స్, ఐటీ-డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సమావేశంలో CM CBN దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘ఏరో స్పేస్, డిఫెన్స్, స్పేస్, క్వాంటం, బయో టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ కీలకం కానున్నాయి. ఈదిశగా పాలసీలు పెడుతున్నాం. IIT-IISER ఆధ్వర్యంలో ఇది ఏర్పాటు కానుంది’ అని తెలిపారు.
News January 16, 2026
ప్రాధాన్యం సంతరించుకున్న మోదీ WB టూర్

PMమోదీ రేపు, ఎల్లుండి WBలో చేపట్టనున్న పర్యటన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. APRలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ₹3,250CR ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. ఇతర రాష్ట్రాలకు 7 అమృత్ భారత్ రైళ్లను, తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్‌ను ప్రారంభిస్తారు. సింగూర్‌లో ₹830CR అభివృద్ధి పనులకు శ్రీకారం, బాలాగఢ్‌లో 900 ఎకరాల్లో కార్గో హ్యాండ్లింగ్ టెర్మినల్‌కు శంకుస్థాపన చేస్తారు.
News January 16, 2026
2034 వరకు ప్రభుత్వాన్ని కొనసాగిస్తాం: సీఎం

TG: తాను ఓడిపోయిన వారి గురించి మాట్లాడదలుచుకోలేదని సీఎం రేవంత్ పరోక్షంగా కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘నాకిచ్చిన బాధ్యతతో పని చేయాలి అనుకుంటున్నా. ఇతరుల గురించి మాట్లాడి టైమ్ వేస్ట్ చేయను. రాబోయే ఎన్నికలతో పాటు 2034 వరకు ప్రభుత్వాన్ని కొనసాగిస్తాం’ అని నిర్మల్ సభలో స్పష్టం చేశారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరిస్తామని హామీ ఇచ్చారు.


