News April 4, 2025
నేపాల్‌లో భూకంపం

నేపాల్‌లో భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.0గా నమోదైంది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూమికి 20 కిలోమీటర్ల లోపల భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఢిల్లీ-NCRతో సహా ఉత్తర భారతంలో పలు చోట్ల భూ ప్రకంపనలు వచ్చినట్లు తెలిపింది. ఇటీవల మయన్మార్‌లో భూకంపం ధాటికి 3వేల మందికి పైగా ప్రజలు మరణించిన విషయం తెలిసిందే.
Similar News
News April 12, 2025
ఆ రైతులకు ఉచిత విత్తనాలు ఇవ్వాలి: హరీశ్ రావు

TG: కాంగ్రెస్ ప్రభుత్వం పంటలకు బీమా ఇవ్వలేదని హరీశ్ రావు దుయ్యబట్టారు. రైతు బీమా కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సిద్దిపేటలోని రాజగోపాల్ పేటలో అకాలవర్షాలకు దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. వడగళ్లతో పంట నష్టపోయిన రైతులకు ఉచిత విత్తనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో రైతుబంధు, రైతుబీమా ఇచ్చామని గుర్తు చేశారు.
News April 12, 2025
రూ.300 కోట్ల డీల్ వదిలేసుకున్న విరాట్?

ప్రముఖ అప్పారెల్ బ్రాండ్ పూమాతో 8ఏళ్ల బంధానికి క్రికెటర్ విరాట్ కోహ్లీ స్వస్తి పలికారు. ఆ కంపెనీ ఏకంగా రూ.300 కోట్లు ఆఫర్ చేసినా ఆయన తిరస్కరించినట్లు క్రీడావర్గాలు చెబుతున్నాయి. 2017లో పూమాతో 8ఏళ్ల కాలానికి రూ.110 కోట్లతో కోహ్లీ ఒప్పందం చేసుకున్నారు. అది ఇటీవల ముగిసింది. ఇక నుంచి తన సొంత బ్రాండ్ ‘వన్8’ను ప్రమోట్ చేయాలన్న ఉద్దేశంతో విరాట్ ఆ సంస్థకు నో చెప్పినట్లు సమాచారం.
News April 12, 2025
అండర్సన్‌కు ‘నైట్‌హుడ్’ అవార్డ్

లెజెండరీ క్రికెటర్ జేమ్స్ అండర్సన్‌కు ఇంగ్లండ్ ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం ‘నైట్‌హుడ్’ను ప్రకటించింది. ఈ పురస్కార గ్రహీతలను ‘సర్’ అనే బిరుదుతో సత్కరిస్తారు. దీంతో ‘కంగ్రాట్స్ సర్ జిమ్మి అండర్సన్’ అని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. తమ దేశ క్రికెట్‌కు ఆయన అందించిన సేవలను కొనియాడింది. అండర్సన్ 188 టెస్టుల్లో 704 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్ టేకర్‌గా నిలిచారు.