News April 12, 2025
పసిఫిక్ దేశంలో భూకంపం

పసిఫిక్ దేశం పపువా న్యూగినియాలో భూకంపం ప్రకంపనలు సృష్టించింది. రిక్టర్ స్కేలుపై 6.2 మ్యాగ్నిట్యూడ్ తీవ్రత నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. అయితే ఎలాంటి నష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని హెచ్చరించారు.
Similar News
News January 21, 2026
పురుగు మందుల తయారీదారులకు కఠిన నిబంధనలు

కేంద్రం తీసుకురానున్న నూతన చట్టం ప్రకారం ప్రతి డబ్బాపై పురుగు మందు పేరు, బ్యాచ్ నంబరు, గడువు తేదీతో పాటు తయారీ సంస్థ చిరునామా, అందులో వాడిన రసాయనాల వివరాలను తప్పనిసరిగా ముద్రించాలి. ప్యాకేజింగ్ ప్రమాణాలను పాటించడంతో పాటు, QR కోడ్ ముద్రించి రైతులకు ఆ మందుల వివరాలు ఈజీగా తెలుసుకునేలా చేయాలి. లైసెన్స్ ఉన్న ప్రాంగణాల్లో మాత్రమే ఉత్పత్తి జరగాలి. భద్రతా ప్రమాణాల విషయంలో ఎలాంటి రాజీ పడకూడదు.
News January 21, 2026
హైదరాబాద్లోని IIMRలో ఉద్యోగాలు

<
News January 21, 2026
కేంద్రప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటే ACB కేసు పెట్టొచ్చు: SC

కేంద్రప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకుంటే CBI ముందస్తు అనుమతి లేకుండానే రాష్ట్ర పోలీసులు కేసు పెట్టవచ్చని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అవినీతి నిరోధక చట్టంలోని Sec-17 ప్రకారం రాష్ట్ర ఏజెన్సీ, కేంద్ర ఏజెన్సీతో పాటు ఏ ఇతర పోలీసు ఏజెన్సీ అయినా కేసు పెట్టొచ్చంది. అవినీతికి పాల్పడ్డ కేంద్రప్రభుత్వ ఉద్యోగిపై రాజస్థాన్ ACB కేసుపెట్టడాన్ని అక్కడి హైకోర్టు సమర్థించగా సుప్రీంకోర్టు సైతం ఏకీభవించింది.


