News April 13, 2025
తజికిస్థాన్‌లో భూకంపం

తజికిస్థాన్‌లో ఇవాళ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.4గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. 16 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించారు. ఆస్తి, ప్రాణ నష్టంపై సమాచారం రావాల్సి ఉంది. మయన్మార్‌లోనూ ఇవాళ మరోసారి భూమి కంపించిన విషయం తెలిసిందే.
Similar News
News April 14, 2025
అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు యోచన

AP: అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. విజయవాడ ఇబ్రహీంపట్నం వద్ద పెదలంక, చినలంకలో భూములను మంత్రి నారాయణ, MLAలు, కలెక్టర్ పరిశీలించారు. అంతర్జాతీయ క్రీడలు నిర్వహించేలా ఈ స్పోర్ట్స్ సిటీ ఉండాలని CM చెప్పారని మంత్రి వెల్లడించారు. ఇందుకోసం 2 వేల ఎకరాల అవసరం ఉంటుందని, లంక భూముల్లో సాధ్యాసాధ్యాలపై కమిటీ వేస్తున్నట్లు చెప్పారు. నివేదిక ఆధారంగా ముందుకెళ్తామన్నారు.
News April 14, 2025
CSKలో తెలుగు కుర్రాడి అరంగేట్రం

తెలుగు కుర్రాడు షేక్ రషీద్ ఐపీఎల్‌లో CSK జట్టు తరఫున ఈరోజు అరంగేట్రం చేస్తున్నాడు. గుంటూరుకు చెందిన ఈ యువ ఓపెనింగ్ బ్యాటర్ 2022లో భారత అండర్-19 జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. సెమీస్, ఫైనల్లో రాణించి జట్టుకు కప్ అందించాడు. CSK గత ఏడాదే కొనుగోలు చేసినా అతడికి తుది జట్టులో స్థానం దక్కలేదు. ఈరోజు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రషీద్ రాణించాలని తెలుగు క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.
News April 14, 2025
చెత్త ప్రదర్శన.. అయినా తగ్గని CSK క్రేజ్

IPL: చెన్నై ఈ ఏడాది చెత్త ప్రదర్శనతో వరుస పరాజయాలు మూటగట్టుకుంటున్న విషయం తెలిసిందే. ధోనీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినా గత మ్యాచ్‌లో ఫలితం మారలేదు. అయినా SMలో క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. లక్నోలో ఇవాళ LSG, CSK మ్యాచ్ సందర్భంగా సోషల్ మీడియా బజ్‌పై స్టార్ స్పోర్ట్స్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో 84% చెన్నైకి, 16% లక్నోకు సపోర్ట్ చేస్తున్నట్లు తేలింది. ఇవాళ గెలుపుపై చెన్నై ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.