News September 25, 2024

Ease of Business: డీక్రిమినలైజ్ కోసం 300 లా పాయింట్లు షార్ట్‌లిస్ట్

image

మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌కు బూస్ట్ ఇచ్చేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 300 లా పాయింట్లు, సెక్షన్లను షార్ట్‌లిస్ట్ చేసింది. వివిధ మంత్రిత్వ శాఖల్ని సంప్రదించి వీటిలో సగం వరకు డీక్రిమినలైజ్ చేస్తామని కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ అన్నారు. జన్ విశ్వాస్ 2.0 కింద కంపెనీలపై రూల్స్ ఒత్తిడి తగ్గిస్తామన్నారు. ప్రతి ఎలక్ట్రానిక్ డివైజులో మేకిన్ ఇండియా పరికరం ఉండాలన్నదే తమ గోల్‌ అని చెప్పారు.

Similar News

News November 28, 2025

విమాన వేంకటేశ్వరస్వామి విశిష్టత

image

తిరుమల గర్భాలయంపై ఉన్న గోపురాన్ని ఆనంద నిలయ విమానం అంటారు. ఈ గోపురంపై కొలువై ఉన్న స్వామివారి రూపమే ‘విమాన వేంకటేశ్వర స్వామి’. విమానం అంటే కొలవడానికి వీలుకాని అపారమైన శక్తి కలిగినది అని అర్థం. ఇది భక్తులకు నేరుగా వైకుంఠవాసుడిని చూసిన అనుభూతినిస్తుంది. ఈ గోపురంలో మొత్తం 60 మంది దేవతా మూర్తులు ఉంటారు. ఈ స్వామిని దర్శించడం అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు. <<-se>>#VINAROBHAGYAMU<<>>

News November 28, 2025

రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఎంతో సహకరిస్తోంది: పవన్

image

AP: కూటమి ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేస్తోందని Dy.CM పవన్ చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఎంతగానో సహకరిస్తోందని తెలిపారు. అమరావతిలో బ్యాంకులకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రధాన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బీమా కార్యాలయాలు ఒకేచోట ఉండటం వల్ల వ్యాపార, ఆర్థిక కార్యకలాపాలు వేగంగా సాగుతాయన్నారు. ఇవాళ్టి కార్యక్రమం భవనాలకే కాకుండా ఏపీ భవిష్యత్తుకు పడిన పునాది అని పేర్కొన్నారు.

News November 28, 2025

త్వరలో.. ఇంట్లోనే ఆధార్ మొబైల్ నంబర్ మార్చుకోవచ్చు!

image

ఆధార్‌కార్డుకు లింక్ అయిన మొబైల్ నంబర్‌ను ఇంటి నుంచే మార్చుకోవచ్చని UIDAI ప్రకటించింది. ‘Aadhaar’ యాప్ ద్వారా OTPతో పాటు ఫేస్ అథెంటికేషన్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చని పేర్కొంది. ఈ సేవ త్వరలో అందుబాటులోకి రానుందని పేర్కొంటూ యాప్ వివరాలను వెల్లడించింది. ఇప్పటివరకూ మొబైల్ నంబర్ అప్డేట్ కోసం ఆధార్ కేంద్రాలకు వెళ్లి వేచి చూడాల్సి వచ్చేది. ఇక్కడ క్లిక్ చేసి యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి. SHARE IT