News August 27, 2024

మా అనుమానాలను ఈసీ క్లియర్ చేయాలి: అంబటి రాంబాబు

image

AP: గత ఎన్నికల పోలింగ్ శాతంపై తమకు అనుమానాలు ఉన్నాయని, వీటిని EC నివృత్తి చేయాలని YCP నేత అంబటి రాంబాబు కోరారు. CEO వివేక్ యాదవ్‌తో YCP నేతల భేటీ అనంతరం అంబటి మీడియాతో మాట్లాడారు. ‘ఏ అసెంబ్లీ స్థానంలో, ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పడ్డాయో ఈసీ ప్రకటించాలి. పోలింగ్ శాతాన్ని 3 సార్లు ప్రకటించడం విడ్డూరం. ఫామ్ 20 ఎందుకు అప్లోడ్ చేయటం లేదు? దీనిపై ఎన్నికల కమిషన్ అశ్రద్ధ వహిస్తోంది’ అని ఆయన మండిపడ్డారు.

Similar News

News April 2, 2026

వరంగల్: అంగన్‌వాడీ పోస్టులు ఎప్పుడు..?

image

వరంగల్ జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీ పోస్టులు భర్తీ కాకపోవడంతో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో 919 కేంద్రాలు ఉండగా.. 66 టీచర్, 284 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వరంగల్, వర్ధన్నపేట, నర్సంపేట ప్రాజెక్టుల పరిధిలో ఎక్కువ ఖాళీలు ఉన్నాయి. సిబ్బంది కొరతతో ఉన్న టీచర్లకే అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో పౌష్ఠికాహారం, సర్వేలు సక్రమంగా జరగడం లేదు.

News April 2, 2026

బరువు తగ్గాలా? సమ్మర్ బెస్ట్..!

image

వెయిట్ లాస్ కావడానికి వేసవి మంచి సీజన్. చలి, వర్షాకాలంతో పోలిస్తే ఈ సీజన్‌లో ఉదయం త్వరగా నిద్ర లేవచ్చు. వాకింగ్, రన్నింగ్‌కు వెళ్తే చెమట ద్వారా ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి. స్విమ్మింగ్ కూడా మంచి ఎక్సర్‌సైజ్. వేడి వాతావరణం, వాటర్ ఎక్కువ తాగడం వల్ల ఆకలి వేయదు. ఇది ఒకరకంగా బరువు పెరగకపోవడానికి దోహదపడుతుంది. ఈ సీజన్‌లో లభించే పుచ్చ, నారింజ, దోస, కొబ్బరినీళ్లు తీసుకుంటే జీర్ణక్రియ మెరుగవుతుంది.

News April 2, 2026

రేపటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన!

image

AP: రాష్ట్రంలోని గ్రామాల్లో సర్పంచ్‌ల పదవీకాలం నేటితో ముగియనుంది. దీంతో రేపటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన అమల్లోకి రానుంది. ఈ మేరకు కూటమి ప్రభుత్వం 20రోజుల కిందటే ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పదవీ కాలం మొన్నటితో ముగిసింది. దీంతో కొత్త SEC వచ్చిన తర్వాతే స్థానిక ఎన్నికలపై క్లారిటీ వచ్చే అవకాశముంది.