News December 2, 2024
ఈ పండ్లు తినండి!

మంచి స్కిన్ కోసం నిమ్మ, యాపిల్, కొబ్బరి, క్యారెట్
మంచి కంటి చూపు కోసం క్యారెట్, యాపిల్ & విటమిన్ ఎ పండ్లు
హైడ్రేషన్ కోసం దోసకాయ, నారింజ, పుచ్చకాయ
కిడ్నీ ఆరోగ్యం కోసం రోజుకు 2-3 లీటర్ల నీరు తాగాలి, బీన్స్, టమాటా తినాలి
ఎర్ర రక్త కణాల కోసం బీట్రూట్, క్యారెట్, దోసకాయలు
బలమైన ఎముకలు & రోగనిరోధక శక్తి కోసం, గుడ్లు, చేపలు, మాంసం
ఆరోగ్యమైన గుండె కోసం అవకాడో, బీన్స్, వెల్లుల్లి, ఉల్లిపాయలు
Similar News
News December 7, 2025
CSIR-CCMBలో ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని CSIR-సెంటర్ ఫర్ సెల్యూలర్ &మాలిక్యులర్ బయాలజీలో 13 సైంటిస్టు పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 9 నుంచి 30 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని జనవరి 6వరకు పోస్ట్ చేయాలి. నెలకు జీతం రూ.1,38,652 చెల్లిస్తారు. పూర్తి స్థాయి నోటిఫికేషన్లో విద్యార్హత, వయసు, పరీక్ష విధానం వెల్లడించనున్నారు. వెబ్సైట్: https://www.ccmb.res.in/
News December 7, 2025
టెన్త్ విద్యార్థులకు శుభవార్త

AP: ప్రభుత్వ స్కూళ్లలో చదివే టెన్త్ విద్యార్థులకు విద్యాశాఖ శుభవార్త చెప్పింది. 100 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా మార్చి వరకు సెలవుల్లోనూ మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. స్పెషల్ క్లాసులకు హాజరయ్యే వారికి రెండో శని, ఆదివారాల్లో మెనూ ప్రకారం భోజనం అందించాలని అధికారులను ఆదేశించింది.
News December 7, 2025
డ్రగ్స్‌తో పట్టుబడితే 20 ఏళ్ల జైలు: రవికృష్ణ

AP: సరదాల కోసం డ్రగ్స్‌కు అలవాటుపడి భవిష్యత్తు పాడు చేసుకోవద్దని ఈగల్ IG రవికృష్ణ సూచించారు. ‘డ్రగ్స్ వాడుతూ పట్టుబడితే 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. ఉద్యోగ అవకాశం కోల్పోతారు. జీవితాంతం దేశంలో ఎక్కడ ఉన్నా పోలీసు నిఘా ఉంటుంది. అనుమానం వస్తే తిరిగి జైలు తప్పదు’ అని హెచ్చరించారు. పిల్లలు డ్రగ్స్‌కు అలవాటుపడకుండా పేరెంట్స్ చూడాలన్నారు. డౌట్ వస్తే ‘1972’ నంబర్‌కి చెబితే రక్షించుకోవచ్చని తెలిపారు.


