News May 19, 2024

ఉదయం 8 గంటలకు టిఫిన్ తినండి: వైద్యులు

image

ఉదయం 8 గంటలకు అల్పాహారం, రాత్రి 8 గంటలకు చివరి భోజనం తినడాన్ని తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలని ఫ్రాన్స్‌లోని వర్సిటీ సోర్బన్ ప్యారిస్ నోర్డ్ వైద్యులు చెబుతున్నారు. ఉదయం 8 గంటలకు తినేవారి కంటే, 9 గంటలకు తినే వారిలో హార్ట్ సమస్యలు వచ్చే అవకాశం 6శాతం ఎక్కువగా ఉంటాయన్నారు. రాత్రి 8కి బదులు 9 గంటలకు తినడం వల్ల మహిళల్లో స్ట్రోక్ వంటి సెరెబ్రోవాస్కులర్ వ్యాధి వచ్చే ప్రమాదం 28శాతం పెరుగుతుందన్నారు.

Similar News

News October 22, 2025

2,570 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

RRB 2,570 ఇంజినీరింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా, బీటెక్ అర్హతగల అభ్యర్థులు ఈనెల 31 నుంచి నవంబర్ 30వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 33ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష(CBT-1, CBT-2), సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.rrbapply.gov.in

News October 22, 2025

జైషే మహ్మద్ మరో కుట్ర?

image

పాక్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రసంస్థ జైషే మహ్మద్ మరో కుట్రకు తెరలేపినట్లు తెలుస్తోంది. ఇటీవల ఏర్పాటైన <<17958042>>మహిళా వింగ్ <<>>కోసం రిక్రూట్‌మెంట్, నిధులు సేకరించేందుకు ఆన్‌లైన్ జిహాదీ కోర్స్ ప్రారంభించినట్లు సమాచారం. జైషే చీఫ్ మసూద్ సిస్టర్స్ సాదియా, సమైరా, మరికొందరు రోజూ 40నిమిషాలు పాఠాలు చెప్తారని తెలుస్తోంది. ఇందులో పాల్గొనేవారు 500 పాక్ రుపీస్ డొనేషన్ ఇవ్వాలంటున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

News October 22, 2025

పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయించారా?

image

తెలుగు రాష్ట్రాల్లో పశువుల్లో ప్రమాదకరమైన గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు వేస్తున్నారు. నవంబర్ 14 వరకు అన్ని జిల్లాల్లో పశువులకు వీటిని అందించనున్నారు. 4 నెలల వయసు పైబడిన పశువులు అన్నింటికీ ఈ వ్యాక్సిన్స్ వేస్తారు. పశుపోషకుల ఇళ్ల వద్దకే సిబ్బంది వచ్చి ఉచితంగా టీకాలు అందిస్తున్నారు. పాడిరైతులు నిర్లక్ష్యం చేయకుండా పశువులకు ఈ వ్యాక్సిన్స్ వేయించాలని పశుసంవర్ధక శాఖ అధికారులు కోరుతున్నారు.