News July 9, 2024

16 రకాల కీటకాలను తినేందుకు సింగపూర్‌లో ఆమోదం

image

మిడతలు, గొల్లభామలు సహా 16 రకాల కీటకాలను ఆహారంగా తీసుకునేందుకు సింగపూర్ తమ ప్రజలకు అనుమతినిచ్చింది. వాటి దిగుమతులపై నియంత్రణ ఉండదని, ఆదేశాలు విడుదలైన క్షణం నుంచే వాటిని తినొచ్చని తెలిపింది. దీంతో అక్కడి హోటళ్ల యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేశాయి. చైనా, వియత్నాం, థాయ్‌ల్యాండ్ వంటి దేశాల నుంచి కీటకాల దిగుమతుల్ని ప్రారంభించాయి. కీటకాల్లో పలు రకాలైన ప్రొటీన్లు, ఖనిజాలు ఉంటాయంటున్నారు అక్కడి ప్రజలు.

Similar News

News January 22, 2026

కొత్త జిల్లాల ఎత్తివేత ప్రచారంపై భట్టి క్లారిటీ

image

TG: కొత్త జిల్లాలను ఎత్తివేస్తారనే ప్రచారానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెరదించారు. అదంతా తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. అసలు జిల్లాల రద్దు ప్రస్తావన, అలాంటి ఆలోచన కూడా లేదని కుండ బద్దలుకొట్టారు. ఇక సింగరేణి వివాదంపైనా భట్టి స్పందించారు. సంస్థ ఆస్తులు దోపిడీకి గురికాకుండా కాపాడతామని స్పష్టం చేశారు. దీనిపై పూర్తి వివరాలతో రేపు మాట్లాడతానని వెల్లడించారు.

News January 22, 2026

గృహ ప్రవేశాలకు శుభ ముహూర్తాలివే!

image

గృహప్రవేశాలకు శుభఘడియలు వచ్చేశాయి. ఫిబ్రవరి 19 నుంచి మళ్లీ శుభకార్యాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరిలో 19, 20, 21, 24, 25, 26 తేదీలు గృహప్రవేశాలకు అత్యంత అనుకూలమని పురోహితులు చెబుతున్నారు. అలాగే MAR (1,3,4,7,8,9), APR (10,11,15,16,20,21,25), MAY (1,6,7,8), AUG(16,17,18,21,22), SEP (5,6,9,10,13), OCT (29,30,31), NOV (1,2,6,7,8), DEC(4,5,9,10,11) నెలల్లో కూడా వరుసగా శుభ ముహూర్తాలు ఉన్నాయి. SHARE IT

News January 22, 2026

AI దెబ్బతో కార్లకు చిప్‌ల కొరత

image

AI డేటా సెంటర్లు భారీగా విస్తరిస్తుండటంతో ఈ ప్రభావం కార్ల పరిశ్రమకు కొత్త సంక్షోభాన్ని తెచ్చిపెట్టింది. ఏఐ సర్వర్లకు భారీగా అవసరమయ్యే DRAM (Dynamic Random Access Memory) చిప్స్‌కు డిమాండ్ పెరగడంతో వాటి ధరలు 70-100% వరకు ఎగబాకాయి. చిప్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు డేటా సెంటర్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. పరిస్థితి మారకపోతే కార్ల ఉత్పత్తిపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.