News September 2, 2024
ఫోడ్మ్యాప్ ఆహారం తీసుకుంటున్నారా?

ఫోడ్మ్యాప్ ఆహారమైన నూడుల్స్, క్యాబేజీ, కాలీఫ్లవర్, పనీర్, ఐస్క్రీమ్, తేనె ఆల్కహాల్, వెల్లుల్లి, బిస్కెట్లు, చాక్లెట్లను సాధ్యమైనంత వరకు దూరం పెట్టాలని నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకుంటే కడుపులో మంట/నొప్పి, గ్యాస్, వికారం, కడుపు ఉబ్బరం సమస్యలు ఏర్పడతాయని అంటున్నారు. లో ఫోడ్ మ్యాప్ ఆహారమైన అన్నం, ఓట్స్, పెసర, శనగ పప్పు, అరటి, చికెన్, చేపలు, బాదం, అల్లం వంటివి తీసుకోవాలని సూచిస్తున్నారు.
Similar News
News November 14, 2025
ఇక బెంగాల్ వంతు: కేంద్ర మంత్రి

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తున్నామని, ఇక తర్వాతి లక్ష్యం పశ్చిమ బెంగాల్ అని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ‘అరాచక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకూడదని బిహార్ నిర్ణయించుకుంది. ఇక్కడి యువత తెలివైనది. ఇది అభివృద్ధి సాధించిన విజయం. బెంగాల్లో అరాచక ప్రభుత్వం ఉంది. అక్కడా మేం గెలుస్తాం’ అని ధీమా వ్యక్తం చేశారు. కాగా వచ్చే ఏడాది బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
News November 14, 2025
4 రౌండ్లు ముగిసే సరికి ఆధిక్యంలో కాంగ్రెస్

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. నాలుగో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 9వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు 4 రౌండ్లలోనూ ఆయన లీడ్ సాధించారు. BRSకు మూడో రౌండ్లోని ఒక EVMలో స్వల్ప ఆధిక్యం వచ్చింది. ప్రస్తుతం ఐదో రౌండ్ ఓట్లు లెక్కిస్తున్నారు.
News November 14, 2025
వంటింటి చిట్కాలు

* పండ్లు, కూరగాయలు త్వరగా పాడవకుండా ఉండాలంటే వేడినీళ్లలో రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్ వేసి కడగాలి. ఆ తర్వాత సాధారణ నీటితో కడగాలి.
* దోసెలు పెనానికి అతుక్కుపోకుండా ఉండాలంటే ముందుగా పెనంపై వంకాయ లేదా ఉల్లిపాయ ముక్కతో రుద్దితే చాలు.
* కాకరకాయ కూరలో సోంపు గింజలు/ బెల్లం వేస్తే చేదు తగ్గుతుంది.
* పుదీనా చట్నీ కోసం మిక్సీలో పదార్థాలని ఎక్కువ సేపు తిప్పకూడదు. ఇలా చేస్తే చేదుగా అయిపోతుంది.


