News November 27, 2024

కుర్‌కురే తినడంతోనే ఫుడ్ పాయిజన్: ప్రభుత్వం

image

TG: మాగనూర్‌లో గురుకుల విద్యార్థులు <<14722784>>ఫుడ్ పాయిజన్‌<<>> వల్ల అస్వస్థతకు గురికావడంపై ప్రభుత్వం హైకోర్టులో వివరణ ఇచ్చింది. ఆ విద్యార్థులు కుర్‌కురేలు తినడం వల్లే అస్వస్థతకు గురైనట్లు కోర్టుకు చెప్పింది. బాధ్యులపై చర్యలు తీసుకున్నామని చెప్పింది. కాగా కారకులపై ఏ చర్యలు తీసుకున్నారో చెప్పాలని మాగనూర్‌‌తో పాటు కరీంనగర్‌, బురుగుపల్లి ఘటనలపై హైకోర్టు ఆదేశాలిచ్చింది.

Similar News

News February 7, 2026

కాలే కడుపునకు మండే గంజి

image

విపరీతమైన ఆకలిగా ఉన్నప్పుడు నోరు కాలేంత వేడి గంజి ఇచ్చినా అది ఎంతో రుచిగా, తృప్తిగా అనిపిస్తుంది. అదే కడుపు నిండిన వాడికి గారెలు కూడా చేదుగా అనిపిస్తాయి. ఏదైనా వస్తువు లేదా సాయం మనకు బాగా అవసరమైనప్పుడు దాని నాణ్యత కంటే ఆ సమయంలో అది అందడమే గొప్ప విషయంగా భావిస్తాము. నిజ జీవితంలో సరైన సమయానికి లభించే సాయం యొక్క ప్రాముఖ్యతను వివరించడానికి ఈ సామెతను వాడుతుంటారు.

News February 7, 2026

సూర్యుడికి అర్ఘ్యం.. ఎప్పుడు సమర్పించాలంటే?

image

2026, FEB 8న భాను సప్తమి. ఈ రోజున సూర్యుడి అనుగ్రహం కోసం సూర్యోదయ ముహూర్తంలో అర్ఘ్యం సమర్పించడం శ్రేష్ఠం. మాఘ శుక్ల సప్తమి తిథి ఆదివారం తెల్లవారుజామున 2:54 గంటలకే ప్రారంభమవుతుంది. కావున 5:26 AM – 7:13 AM మధ్య పుణ్యస్నానాలు ఆచరించాలి. ఉదయించే సూర్యుడికి రాగి పాత్రతో నీటిని అర్ఘ్యంగా వదలాలి. ఈ పవిత్ర సమయంలో ఆదిత్యుడిని ఆరాధించడం వల్ల జాతక దోషాలు తొలగి, ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయని శాస్త్రవచనం.

News February 7, 2026

నేటి నుంచి T20I WC.. ఇవాళ ట్రిపుల్ ధమాకా

image

భారత్, శ్రీలంక వేదికగా నేటి నుంచి T20I WC మొదలు కానుంది. మార్చి 8(ఫైనల్) వరకు జరిగే ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూపులుగా విడిపోయి పోటీ పడనున్నాయి. ఇవాళ్టి నుంచి ఈ నెల 19 వరకు రోజుకు మూడు మ్యాచుల చొప్పున జరగనున్నాయి. తొలి మ్యాచ్ పాకిస్థాన్vsనెదర్లాండ్స్(11am), రెండో మ్యాచ్ వెస్టిండీస్vsస్కాట్లాండ్(3pm), మూడో మ్యాచ్ ఇండియాvsUSA(7pm) మధ్య జరగనున్నాయి.
Live: జియో హాట్‌స్టార్, Hot Star