News November 28, 2024
బ్రష్ చేసిన వెంటనే తింటున్నారా?
చాలా మంది బ్రష్ చేసిన వెంటనే టిఫిన్ చేస్తుంటారు. వెంటనే తింటే నోటిలో సలైవా ఉత్పత్తి తగ్గి జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. నోటిలోని Ph స్థాయి ఆల్కలైన్‌గా మారుతుంది. ఇది ఆహార పదార్థాలను కొంతసేపటి వరకు జీర్ణం కాకుండా చేస్తుంది. దీంతో ఆహార పదార్థాల రుచిని నాలుక గుర్తించలేదు. టూత్‌పేస్ట్‌లో ఉండే కొన్ని కెమికల్స్ నోటి రుచిని తాత్కాలికంగా మార్చివేస్తాయి. అందుకే బ్రష్ చేసిన 10-15 నిమిషాల తర్వాత తినడం ఉత్తమం.
Similar News
News November 28, 2024
చంద్రబాబుపై కేసుల్లో కౌంటర్ వేయండి: హైకోర్టు
AP: 2014-19 మధ్య స్కామ్‌లు జరిగాయంటూ చంద్రబాబుపై నమోదైన కేసులు, ఛార్జిషీట్లను హైకోర్టు ముందు ఉంచాలని కోరుతూ దాఖలైన అనుబంధ పిటిషన్‌పై న్యాయస్థానం స్పందించింది. వీటిపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసులను సీబీఐ, ఈడీలకు అప్పగించాలన్న పిల్‌పై కౌంటర్ దాఖలుకు మరింత సమయం ఇచ్చింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేస్తూ సీజే జస్టిస్ ధీరజ్‌సింగ్ ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది.
News November 28, 2024
ఎల్లుండి 3 లక్షల మంది ఖాతాల్లోకి డబ్బులు
TG: పలు కారణాలతో రుణమాఫీ నిలిచిన 3 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ నెల 30న డబ్బులు జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. రైతు సంక్షేమంపై CM రేవంత్ చిత్తశుద్ధితో ఉన్నారని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి రైతు బీమాను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ధాన్యం దిగుబడిలో తెలంగాణ తొలి స్థానంలో ఉందన్నారు. మనం పండించిన వడ్లు మలేషియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు ఎగుమతి అవుతున్నాయని పేర్కొన్నారు.
News November 28, 2024
రాజ్యసభకు పవన్ కళ్యాణ్ సోదరుడు?
AP: జనసేన నేత నాగబాబును రాజ్యసభకు పంపే ప్రయత్నాల్లో Dy.CM పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఖాళీ అయిన 3 స్థానాల్లో ఒకటి తమకు కేటాయించాలని కోరినట్లు సమాచారం. ఢిల్లీ పర్యటనలో ఎన్డీఏ పెద్దలతో ఇదే విషయాన్ని ప్రస్తావించారని టాక్. కాగా లోక్‌సభ ఎన్నికల్లోనే అనకాపల్లి నుంచి నాగబాబు పోటీ చేయాలని భావించినా కూటమి సీట్ల పంపకాల్లో ఆ స్థానం BJPకి వెళ్లింది. దీంతో ఆయనను రాజ్యసభకు పంపాలని పవన్ భావిస్తున్నారు.