News December 4, 2024

శీతాకాలంలో వీటిని తింటున్నారా?

image

చలికాలంలో కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నూనెలో వేయించిన పకోడీ, బజ్జీ, సమోసాలు తింటే అరుగుదల కష్టంగా మారుతుంది. జున్ను, పాల ఉత్పత్తులు తీసుకుంటే సైనసైటిస్ వచ్చే ఛాన్స్ ఉంది. మటన్, బీఫ్, పోర్క్ తింటే జీర్ణం కాక కడుపు ఉబ్బరంగా ఉంటుంది. పానీ పూరీ, చాట్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీములు జీర్ణ వ్యవస్థకు హాని కలిగిస్తాయి. మసాలా, నిల్వ పచ్చళ్లకు దూరంగా ఉండటం బెటర్.

Similar News

News January 12, 2026

స్ఫూర్తిని నింపే స్వామి వివేకానంద మాటలు

image

⋆ లేవండి, మేల్కోండి.. గమ్యం చేరే వరకు విశ్రమించకండి
⋆ నీ వెనుక, నీ ముందు ఏముందనేది నీకనవసరం. నీలో ఏముందనేది ముఖ్యం
⋆ రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి. లేకపోతే అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశం కోల్పోతారు
⋆ భయపడకు, ముందుకు సాగు.. బలమే జీవితం, బలహీనతే మరణం
⋆ కెరటం నాకు ఆదర్శం.. లేచి పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు
☛ నేడు వివేకానంద జయంతి

News January 12, 2026

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

image

సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ రూ.1,690 పెరిగి రూ.1,42,150కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,550 ఎగబాకి రూ.1,30,300 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.12వేలు పెరిగి రూ.2,87,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి

News January 12, 2026

‘గోల్డెన్ గ్లోబ్’ వేడుకల్లో ప్రియాంక మెరుపులు

image

అంతర్జాతీయ వేదికపై మరోసారి భారతీయ సినీ స్టార్ మెరిశారు. గతంలో ఆస్కార్ వేడుకల్లో దీపికా పదుకొణె ప్రత్యేక ఆకర్షణగా నిలవగా తాజాగా జరుగుతున్న గోల్డెన్ గ్లోబ్ ఈవెంట్‌కు ప్రియాంకా చోప్రా హాజరయ్యారు. బ్లూడ్రెస్‌లో రెడ్ కార్పెట్‌పై హొయలు పోయారు. తన భర్త నిక్ జోనస్‌తో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. కాగా 2023లో RRR ‘నాటు నాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది.