News January 13, 2026
EC షెడ్‌లో కోడి పిల్లలను వదిలేముందు పేపర్ వేస్తున్నారా?

EC(ఎన్విరాన్‌మెంట్ కంట్రోల్డ్) షెడ్‌లో పొట్టు మీద కోడి పిల్లలను నేరుగా వదలడం మంచిది కాదు. షెడ్‌లో పొట్టు కాస్త పదునుగా ఉండటం వల్ల కోడి పిల్లల కాళ్ల మధ్య గుచ్చుకొని గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ పొట్టుపై కచ్చితంగా పేపర్ వేశాకే చిన్న కోడి పిల్లలను వదలాలి. 1000 పిల్లలకు 5 కేజీల పేపరును పైన వీడియోలో చెప్పిన విధంగా వేయాలి. పేపరు వల్ల కోడి పిల్లలు ఆహారాన్ని సులభంగా గుర్తించి తినగలుగుతాయి.
Similar News
News February 6, 2026
వడ్డీ రేట్లు యథాతథం

కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ యథాతథంగా ఉంచింది. ఈ ఏడాదిలో ఇవాళ జరిగిన తొలి సమీక్షలో రెపో రేటును 5.25 శాతంగానే కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 7.4 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. గతేడాది ఈ వడ్డీరేట్లను ఆర్బీఐ పలుమార్లు సవరించిన విషయం తెలిసిందే. దీంతో 2025 FEB-DEC మధ్య రెపో రేటు 1.25 శాతం తగ్గింది.
News February 6, 2026
SACONలో 36 పోస్టులు… అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ నేచురల్ హిస్టరీ(SACON)లో 36పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ, పీజీ, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, PwBD, EWSలకు రూ.100. వెబ్‌సైట్: www.sacon.in
News February 6, 2026
‘యుఫోరియా’ సినిమా రివ్యూ&రేటింగ్

యువత డ్రగ్స్‌కు అలవాటు పడితే ఏం జరుగుతుంది? ఆ మత్తులో చేసే అకృత్యాల వల్ల జీవితాలు ఎలా మారిపోతాయనేదే స్టోరీ. భూమిక, సారా నటన, యూత్‌ను ఆలోచింపజేసే అంశాలు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ మెప్పిస్తుంది. కథను ఆసక్తికరంగా చెప్పడంలో దర్శకుడు గుణశేఖర్ తడబడ్డారు. సెకండాఫ్ స్క్రీన్ ప్లే కన్ఫ్యూజింగ్‌గా ఉంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీయడంతో కొన్ని సీన్లు ఊహించేలా ఉంటాయి. మ్యూజిక్ ఫర్వాలేదు.
రేటింగ్: 2.25/5


