News May 13, 2024
పల్నాడులో గొడవలపై ఈసీ ఆగ్రహం

AP: పోలింగ్ ప్రారంభానికి ముందే పల్నాడు జిల్లాలో గొడవలు జరగడంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘర్షణ జరిగిన ప్రాంతానికి ఎన్నికల ప్రత్యేక అబ్జర్వర్ రామ్మోహన్ మిశ్రా బయల్దేరారు. వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని, అవసరమైతే అదనపు బలగాలను తరలించాలని అధికారులను ఈసీ ఆదేశించింది. రెంటచింతల మండల కేంద్రంలోని రెంటాలలో టీడీపీ, వైసీపీ వర్గాలు <<13236106>>ఘర్షణ<<>>కు దిగడంతో ఇద్దరు ఏజెంట్లకు గాయాలైన సంగతి తెలిసిందే.
Similar News
News February 10, 2026
ఉపవాస విరమణ ఎలా చేయాలంటే?

ఉపవాస దీక్షను ముగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దీక్ష విరమించిన వెంటనే ఒక్కసారిగా ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోకూడదు. ఇలా చేస్తే జీర్ణ వ్యవస్థపై భారం పడుతుంది. అనారోగ్యం వస్తుంది. మొదట పలచని కొబ్బరినీరు, పాలు, పండ్ల రసాల వంటి ద్రవాహారం తీసుకోవాలి. అనంతరం తేలికగా అరిగే ఆహారాన్ని మితంగా తినాలి. క్రమంగా ఆహార పరిమాణాన్ని పెంచుతూ జీర్ణక్రియను సాధారణ స్థితికి తీసుకురావడం ఆరోగ్యానికి క్షేమకరం.
News February 10, 2026
స్థూల సేంద్రియ ఎరువుల ప్రత్యేక ఏమిటి?

స్థూల సేంద్రియ ఎరువుల్లో పోషకాలు తక్కువ పరిమాణంలో ఉంటాయి. వీటిని ఎక్కువ పరిమాణంలో వాడవలసి ఉంటుంది. వీటి వినియోగంతో నేలలో నీరు ఇంకే స్వభావం, నీరు నిల్వ చేసే గుణం, నీటి పారుదల, నేల ఉష్ణోగ్రత, గాలి ప్రసరణ మెరుగుపడతాయి. ఉదాహరణ: పశువుల ఎరువు, కోళ్లు, మేకల విసర్జన పదార్థాల ఎరువు, పచ్చిరొట్ట ఎరువులు మొదలైనవి. ఇవి మన ఊళ్లలోనే దొరుకుతాయి. వాటిని వృథాగా వదిలేయకుండా పొలాల్లో వేస్తే మంచి ఫలితాలు వస్తాయి.
News February 10, 2026
ఆన్‌లైన్‌లో కోటప్పకొండ దర్శనం టికెట్లు

AP: మహాశివరాత్రి రోజున పల్నాడు జిల్లా కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి దర్శనం టికెట్లు నేటి నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. https://www.aptemples.org/లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అభిషేకం రూ.500, శీఘ్ర దర్శనం రూ.200, ప్రత్యేక దర్శనం రూ.100 టికెట్లు ఆన్‌లైన్‌లో ఉంటాయి. భక్తుల రద్దీ దృష్ట్యా వీఐపీ ఉచిత పాసులు రద్దు చేసి, రూ.300 వీఐపీ దర్శనం టికెట్లు విక్రయిస్తున్నామని ఈవో చంద్రశేఖర్ తెలిపారు.


