News April 28, 2024

AAP సాంగ్‌పై నిషేధం విధించిన EC!

image

ఎన్నికల కోసం రూపొందించిన తమ పార్టీ సాంగ్‌పై EC నిషేధం విధించిందని AAP పేర్కొంది. ఒక ప్రచార పాటను నిషేధించడం ఇదే తొలిసారి కావొచ్చని ఆ పార్టీ మంత్రి ఆతిశీ అన్నారు. అధికారంలోని BJPతో పాటు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలను కించపరిచేలా ఆ పాటలో లిరిక్స్ ఉన్నాయని ఈసీ చెప్పినట్లు ఆమె వెల్లడించారు. అయితే అందులో BJP పేరును ఎక్కడా ప్రస్తావించలేదని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను కూడా ఉల్లంఘించలేదని ఆమె చెప్పారు.

Similar News

News November 17, 2024

తమిళనాడులో టాటాకు చెందిన ఐఫోన్ ఫ్యాక్టరీ

image

తమిళనాడులో ఐఫోన్ ప్లాంట్ కోసం తైవాన్‌కు చెందిన పెగట్రాన్‌తో టాటా సీల్స్ ఒప్పందం చేసుకుంది. ఐఫోన్ ప్లాంట్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసేందుకు టాటా ఎలక్ట్రానిక్స్ అంగీకరించింది. 10,000 మంది ఉద్యోగులున్న ఈ ప్లాంట్‌లో టాటా 60% & పెగట్రాన్ 40% వాటాను కలిగి ఉన్నాయి. ఈ ప్లాంట్ ద్వారా ఏటా 5 మిలియన్ ఐఫోన్‌లను ఉత్పత్తి చేస్తున్నారు. మన దేశంలో టాటాకు చెందిన మూడో ఐఫోన్ ఫ్యాక్టరీ ఇది.

News November 17, 2024

Investing: ఈ స్కీమ్స్ మహిళలకు ప్రత్యేకం

image

మ‌హిళ‌ల‌కు సామాజిక భ‌ద్ర‌త‌, మంచి రిట‌ర్న్ ఇచ్చే పోస్టాఫీసు స్కీమ్స్ కొన్ని ఉన్నాయి. సుక‌న్యా స‌మృద్ధి స్కీం కింద ప‌దేళ్లలోపు ఆడపిల్లల పేరిట 15 ఏళ్ల‌పాటు పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. 8.2% వ‌డ్డీ ల‌భిస్తుంది. నెలవారీ ఆదాయానికి Monthly Income Scheme, మ‌హిళా స‌మ్మాన్ సేవింగ్ స‌ర్టిఫికెట్ కింద రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు ఇన్వెస్ట్ చేయ‌వ‌చ్చు. National Savings Certificate, PPF Schemes అందుబాటులో ఉన్నాయి.

News November 17, 2024

అతనితో జాగ్రత్త.. ఆసీస్ ప్లేయర్లకు మెక్‌గ్రాత్ సూచన

image

భారత స్టార్ ప్లేయర్ కోహ్లీని స్లెడ్జింగ్ చేయొద్దని ఆస్ట్రేలియా ఆటగాళ్లకు మాజీ ప్లేయర్ గ్లెన్ మెక్ గ్రాత్ సలహా ఇచ్చారు. బిగ్ గేమ్స్ అంటే కోహ్లీ చెలరేగుతాడనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో విఫలమైనా అతడిని తక్కువ అంచనా వేయొద్దన్నారు. అతడి జోలికి వెళ్లకుండా ఉంటే ఆసీస్‌కే మేలని అభిప్రాయపడ్డారు.