News March 21, 2024
ముగ్గురు ఎస్పీలకు ఈసీ పిలుపు

AP: గిద్దలూరు, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో రాజకీయ హత్యలు, మాచర్లలో వాహనం తగలబెట్టిన ఘటనలపై EC రంగంలోకి దిగింది. ఈ అంశాలపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని SPలు పరమేశ్వర్రెడ్డి, రవిశంకర్రెడ్డి, రఘువీరారెడ్డిలను ఆదేశించింది. ఈ ఘటనలు ఎందుకు జరిగాయి? ఎవరు చేశారు? ఎందుకు నియంత్రించలేదు? అనే అంశాలపై నేడు వివరణ తీసుకోనుంది. అటు ప్రధాని మోదీ బొప్పూడి సభలో భద్రతా వైఫల్యంపై కేంద్రానికి నివేదికలు పంపింది.
Similar News
News October 27, 2025
ఎస్బీఐలో మరో 3,500 పోస్టుల భర్తీ

నిరుద్యోగులకు SBI గుడ్న్యూస్ చెప్పింది. 3,500 PO పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. గత జూన్లో 505 మంది ప్రొబేషనరీ ఆఫీసర్లను నియమించామని, ప్రస్తుతం 541 PO పోస్టులకు దరఖాస్తులు కొనసాగుతున్నాయని చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ కిశోర్ కుమార్ పోలుదాసు చెప్పారు. ఈ FYలోనే మరో 3వేల సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. త్వరలో వీటికి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని PTI ఇంటర్వ్యూలో తెలిపారు.
News October 27, 2025
రొమాంటిక్ సీన్స్ చేసి ఉంటే సక్సెస్ అయ్యేదాన్ని: నటి ధన్య

కండీషన్లు పెట్టుకోవడం వల్లే తాను ఇండస్ట్రీలో పెద్ద స్థాయికి ఎదగలేకపోయానని నటి ధన్య బాలకృష్ణన్ అన్నారు. రొమాంటిక్ సీన్లు చేయొద్దనే కండీషన్ పెట్టుకోవడంతో చాలా సినిమాలు వదులుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఒకవేళ ఆ సీన్లు చేసి ఉంటే మంచి పొజీషన్లో ఉండేదాన్ని అని పేర్కొన్నారు. మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన తాను ఈ స్థాయికి చేరుకుంటానని ఊహించలేదన్నారు. ఆమె నటించిన ‘కృష్ణలీల’ NOV 7న రిలీజ్ కానుంది.
News October 27, 2025
ఈ జిల్లాల్లో కాలేజీలకు సెలవు

AP: తుఫాను నేపథ్యంలో స్కూళ్లతో పాటు పలు జిల్లాల్లోని జూనియర్ ఇంటర్ కాలేజీలకు అధికారులు సెలవులు ప్రకటించారు. అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని కాలేజీలకు ఈ నెల 29 వరకు సెలవులు ఇచ్చారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, కడప జిల్లాల్లో రేపు హాలిడే ఉండనుంది. కాకినాడలో 31 వరకు సెలవులు ప్రకటించారు. మిగతా జిల్లాల్లో యథావిధిగా కాలేజీలు నడవనున్నాయి.


