News May 24, 2024
ఈసీని అలా ఆదేశించలేం: SC

ఓటింగ్ సమాచారాన్ని పోలింగ్ కేంద్రాల వారీగా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఈసీని ఆదేశించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అందుకు భారీగా ఉద్యోగులు అవసరమవుతారని పేర్కొంది. ఇప్పటికే 5 దశల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో అది సాధ్యం కాదంది. ఎన్నికల తర్వాత సాధారణ బెంచ్ విచారణ చేస్తుందని వెల్లడించింది. కాగా పూర్తి సమాచారాన్ని వెబ్సైట్లో ఉంచేలా ఆదేశించాలని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం SCలో పిటిషన్ వేసింది.
Similar News
News November 11, 2025
లారీ బీభత్సం.. ముగ్గురు మృతి

నెల్లూరు: NTR నగర్ వద్ద నేషనల్ హైవేపై చేపల లోడుతో వెళ్తున్న కంటెయినర్ బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన లారీ రోడ్డు పక్కన గల షాపులతో పాటు టాటా ఏస్, 3 బైకులు, చెట్టును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు చనిపోగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి గల కారణాలు సహా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 11, 2025
నిఠారి కిల్లింగ్స్: సురేంద్ర కోలికి సుప్రీంలో ఊరట

నిఠారి వరుస హత్యల చివరి కేసులో సురేంద్ర కోలి దోషి కాదని సుప్రీంకోర్టు ఇవాళ తీర్పిచ్చింది. మిగతా కేసుల్లోనూ రిలీఫ్ పొందిన కోలి త్వరలో జైలు నుంచి విడుదల కానున్నాడు. నోయిడా శివారు నిఠారి గ్రామంలో 2006 DEC 29న మోహిందర్ పందేర్ ఇంటి వెనక డ్రెయిన్లో 8 మంది చిన్నారుల ఎముకలు లభ్యమయ్యాయి. దీనిపై దర్యాప్తు చేసిన CBI పందేర్, కోలి హత్యాచారాలకు పాల్పడ్డారని తేల్చింది. అయితే కోర్టుల్లో నిరూపించలేకపోయింది.
News November 11, 2025
టమాటాలో బాక్టీరియా ఎండు తెగులును ఎలా నివారించాలి?

బాక్టీరియా ఎండు తెగులు సోకిన టమాటా మొక్కలను పీకి దూరంగా తీసుకెళ్లి కాల్చివేయాలి. మొక్కను తొలగించిన చోట వెంటనే బ్లీచింగ్ పౌడర్ చల్లాలి. ఇలా చేయడం వల్ల బాక్టీరియా ఇతర మొక్కలకు సోకదు. టమాటా నారును నాటుకునే ముందే వేపపిండిని నేలలో చల్లుకోవడం వల్ల ఈ తెగులు వృద్ధి చెందకుండా చేసుకోవచ్చు. తెగులు సోకిన మొక్కలు పొలంలో ఉన్నప్పుడు నీటి తడులు ఇస్తే ఈ తెగులు ఉద్ధృతి మరింత పెరిగి నివారణ కష్టమవుతుంది.


