News March 16, 2024
EC కౌంట్‌డౌన్.. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2..

దేశంలో ఎన్నికల పండుగ ప్రకటనకు కౌంట్‌డౌన్ మొదలైంది. మరో 10ని.లో భారత ఎన్నికల సంఘం ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేయనుంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ సహా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను CEC రాజీవ్ కుమార్ వెల్లడించనున్నారు. అటు పలు చోట్ల ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాల బైపోల్ షెడ్యూల్ కూడా ఇందులో ఉంటుంది.
– ఎన్నికల షెడ్యూల్ లైవ్ అప్డేట్స్, ఆసక్తికర కథనాలు ఎక్స్‌క్లూజివ్‌గా వే2న్యూస్‌లో పొందవచ్చు.
Similar News
News November 26, 2025
NGKL: రేపటి నుంచి సర్పంచ్ నామినేషన్ల స్వీకరణ

నాగర్‌కర్నూల్ జిల్లాలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ గురువారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానుంది. కల్వకుర్తి, వెల్దండ, ఊర్కొండ, వంగూరు, తెలకపల్లి, తాడూరు మండలాల పరిధిలోని గ్రామ పంచాయతీలకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. జిల్లాలో ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
News November 26, 2025
బాలిస్టిక్ క్షిపణి పరీక్షించిన పాకిస్థాన్

యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు పాకిస్థాన్ మిలిటరీ ప్రకటించింది. ‘స్థానికంగా నిర్మించిన నేవల్ ప్లాట్‌ఫామ్ నుంచి మిస్సైల్ పరీక్షించాం. సముద్రం, భూమిపై ఉన్న లక్ష్యాలను ఇది అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలదు. ఇందులో అత్యాధునిక గైడెన్స్ వ్యవస్థలు ఉన్నాయి’ అని పేర్కొంది. కాగా మే నెలలో భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తర్వాతి నుంచి పాకిస్థాన్ ఈ తరహా ప్రయోగాలను పెంచింది.
News November 26, 2025
పుల్లోరం వ్యాధితో కోళ్లకు ప్రమాదం

వైరస్, సూక్ష్మజీవుల వల్ల కోళ్లలో పుల్లోరం వ్యాధి సోకుతుంది. కోడి పిల్లల్లో దీని ప్రభావం ఎక్కువ. తల్లి నుంచి పిల్లలకు గుడ్ల ద్వారా సంక్రమిస్తుంది. రోగం సోకిన కోడిపిల్లలు గుంపులుగా గుమికూడటం, శ్వాసలో ఇబ్బంది, రెక్కలు వాల్చడం, మలద్వారం వద్ద తెల్లని రెట్ట అంటుకోవడం వంటి లక్షణాలుంటాయి. కోడిని కోసి చూస్తే గుండె, కాలేయం, పేగులపై తెల్లని మచ్చలు కనిపిస్తాయి. నివారణకు వెటర్నరీ డాక్టర్ సలహాలను పాటించాలి.


